ఉత్తరాంధ్ర ప్రజల కల రైల్వేజోన్ విషయంలో వైసీపీ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. స్థలం ఇచ్చేశామని బొత్స లాంటి వాళ్లు బుకాయిస్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం చివరి రోజు వరకూ వారికి స్థలం ఇవ్వలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు నెలల్లోనే స్థలం రెడీ చేసింది. . వివాదాలు లేకుండా ముడిసర్లోవలో 52 ఎకరాలను రైల్వేకు అప్పగించడానికి ఏర్పాట్లు చేసింది. అందుకే కేంద్ర మంద్రి పీయూష్ గోయల్ త్వరలో రైల్వేజోన్ ఏర్పాటవుతుందని ప్రకటించారు.
2018లో కేంద్ర కేబినెట్ రైల్వేజోన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. 2019లో వైసీపీ గెలిచింది. ఒక్కటంటే ఒక్క సారి కూడా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని వైసీపీ కేంద్రాన్ని అడగలేదు. తమకు ఉన్న బలంతో ఒత్తిడి చేసి ఉంటే పనైపోయేది. ఈ పాటికి రైల్వేజోన్ ఏర్పాటుతో పాటు.. యువతకు రైల్వే ఉద్యోగాల కోసం పోటీ పడే అవకాశం ఉండేది. కానీ ఐదేళ్ల పాటు స్థలం కూడా రైల్వేకు అప్పగించకుండా తాత్సారం చేశారు. మళ్లీ ప్రకటనలకు కొదవేమీ ఉండదు. స్థలం ఇవ్వకపోయినా రైల్వేశాఖ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే… ఎంత ఆలస్యమైతే అంత మంచిదని ఆ సంస్థ అనుకుంది.
ఇప్పుడు టీడీపీ పట్టుబడుతూండటం.. రైల్వే జోన్ కు కావాల్సిన స్థలంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించేందుకు రెడీ కావడంతో కేంద్రానికి జోన్ ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరో ఏడాదిలో రైల్వేజోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.