ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ప్రారంభం అయ్యాయి. అధికార వై ఎస్ ఆర్ సి పి, ప్రతిపక్ష టీడీపీ ల మధ్య మాటల తూటాలు పేలాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి జగన్ మొదలుకొని, ఇతర వైఎస్ఆర్ సిపి నేతలు వాడుతున్న భాష మరీ తీవ్రంగా ఉండటం జనాలని ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు గాడిదలు కాశారా అని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్ వ్యాఖ్యానిస్తే, దొబ్బి తినడం అనే పదాన్ని వైఎస్సార్సీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ వాడారు. ఇదే జగన్ మరొక సందర్భంలో టిడిపి నాయకులను ఉద్దేశించి మనిషి పెరిగారు కానీ బుద్ధి పెరగలేదు అంటూ టిడిపి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
కాలేశ్వరం ప్రాజెక్టు కు జగన్ హాజరవడం గురించి చంద్రబాబు ప్రస్తావించగా, జగన్ దానికి సమాధానం ఇస్తూ, తను ఆ ప్రారంభోత్సవానికి వెళ్లినా వెళ్లకపోయినా టీఆర్ఎస్ వాళ్లు బటన్ నొక్కితే నీళ్ళు వచ్చేవని, టిఆర్ఎస్ ఆ ప్రాజెక్టును కడుతుండగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని, మరి అప్పుడు చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అంటూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా మరొక వైఎస్సార్సీపీ నేత , మరియు మంత్రి అయిన అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నేతలు దొబ్బి తిన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. సభలో మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారన్న సంగతి ని సైతం విస్మరించి ఆయన చేసిన వ్యాఖ్యలు జనాలను విస్మయపరిచాయి. బహుశా తన తప్పు తానే తెలుసుకున్నాడో ఏమో రికార్డుల నుండి ఆ పదాన్ని తొలగించాలని ఆయనే కోరారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేత అచ్చన్నాయుడు ని ఉద్దేశించి మరొక సందర్భంగా జగన్ మాట్లాడుతూ టిడిపి నేతలు మనిషి పెరిగారు కానీ బుద్ధి పెరగలేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏది ఏమైనా వైకాపా నేతల తీరు, పైగా సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ వాడుతున్న భాష ప్రజల్లో సైతం చర్చకు దారి తీసింది.
https://www.youtube.com/watch?v=6PlUVqj-sm4