సిక్కోలు జిల్లాలో రాజకీయం ఎప్పుడూ వయోలెంట్ గా ఉండదు. కానీ డాక్టర్ సీదిరి అప్పల్రాజు వైసీపీ తరపున ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన తన ఫ్యాక్షన్ లీడర్ ఉండరన్నట్లుగా రెచ్చిపోతున్నారు. మీసాలు పెంచని ఈ రాజకీయ నాయకుడు.. తన పదవి కాలంలో చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ఇప్పుడు పదవి పోయిన తర్వాత ఆయన హత్యారాజకీయాలు చేయిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
తాజాగా పలాసలో ఓ బీహారీ గ్యాంగ్ ను పట్టుకున్నారు. ఆ గ్యాంగ్ అక్కడ ఓ టీడీపీ లీడర్ ను హత్య చేసేందుకు వచ్చింది. రూ. పది లక్షల సుపారీకి మాట్లాడుకుని.. పలాస పట్టణ టీడీపీ అధ్యక్షుడిని చంపేందుకు వచ్చారు. విషయం బయటపడటంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారు ఎక్కడ తన పేరు చెబుతారోనని భయపడిన సీదిరి అప్పలరాజు వారిని విడిచిపెట్టాలని ధర్నాకు దిగారు.
ఇదేమి రాజకీయ ధర్నా కేసు కాదు. సుపారీ మర్డర్ ప్రయత్నం. దీన్ని అంత తేలికగా పోలీసులు వదిలి పెట్టే అవకాశం లేదు. అందుకే విషయం బయటపడిన తర్వాత స్వయంగా ఎస్పీకి కూడా పలాస వచ్చారు. బీహారీ ముఠా నుంచి వివరాలు తెలుసుకున్నారు. అచ్చెన్నాయుడు కూడా పోలీసులకు ఫోన్ చేశారు. హత్యారాజకీయాలు చేస్తే సహించేదిలేదని.. ఈ కుట్రలో ఎవరు ఉన్నా వదిలి పెట్టవద్దని ఆయన స్పష్టం చేశారు.
సీదిరి అప్పలరాజే తన అనుచరుల ద్వారా ఈ ప్లాన్ వేయించారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు తేల్చనున్నారు.