మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ ను అరెస్ట్ చేశారు. చేబ్రోలు కిరణ్ ను పోలీసు స్టేషన్ కు తరలిస్తుండగా కారులో మాధవ్ వెంబడించడంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పులివెందుల ఎమ్మెల్యే జగన్ సతీమణి భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తుండగా.. పోలీసుల వాహనాన్ని మాధవ్ అడ్డుకున్నారు.
పోలీసుల విధులకు ఆటంకం కల్గించారని పోలీసులు మాధవ్ ను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు ఎస్పీ ఆఫీసులో ఎస్కార్ట్ వాహనంపై మాధవ్ చేయి చేసుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం.