వైసీపీ హయాంలో బాగా సంపాదించి హవాలా మార్గంలో తన బినామీ ద్వారా దుబాయ్ కు చేర వేసుకున్న ఏ లీడర్ కు.. ఆ బినామీ గట్టి షాక్ ఇచ్చారన్న వార్త పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. ప్రభుత్వంలో మంచి పొజిషన్ లో ఉండి అన్ని రకాలుగా దందాలు చేయడంలో ఆరి తేరిన లీడర్ సంపాదనను చాలా పకడ్బందీగా విదేశాలకు తరలించడంలో దిట్ట అయిన వ్యక్తిని బినామీగా పెట్టుకున్నారు. అతని పేరు మీదనే వ్యవహారాలు నడుపుతూంటారు. అలా దుబాయ్ కేంద్రంగా ఆ వ్యక్తి ఆ అక్రమ సంపాదనను పెట్టుబడులుగా మారుస్తూ పోయారు.
అయితే ప్రభుత్వం మారగానే ఆ వ్యక్తి యూరప్ కు మాకాం మార్చేశాడని.. ఆ లీడర్ పెట్టుబడులు కూడా తన పేరును అక్కడికి మార్చుకుని ఇప్పుడు అసలైన వ్యక్తి ఫోన్లకు కూడా స్పందించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో అధికార పార్టీ నేతలతో సన్నిహితంగా ఉంటూ.. తన జోలికి రాకుండా చూసుకుంటున్నారని అంటున్నారు. ఈ వ్యవహారం వైసీపీతో పాటు టీడీపీలో నూ చర్చనీయాంశం అవుతోంది. ఆ లీడర్ ఎవరన్నదానిపై అందరూ గుసగుసలాడుకుంటున్నారు.
అయితే ఇదంతా గేమ్ ప్లాన్ అని .. తాను సంపాదించుకున్నది సేఫ్ గా ఉంచుకోవడం కోసమే అతను ఇలాంటి డబుల్ గేమ్ ఆడుతున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తంగా అతనేమీ రాజకీయం చేసినా సంపాదన మాత్రం ఓ రేంజ్ లో ఉండటం .. దాన్ని గుట్టుగా గల్ఫ్ కు తరలించేసుకోవడంలో మాత్రం ఆయన నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.