కొన్నాళ్ల క్రితం పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవిని పోలీసులు చెన్నై ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు. విజయవాడలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కడప నుంచి ఫ్లైట్ లేకపోవడంతో చెన్నై ఎయిర్ పోర్టుకు వెళ్లి విజయవాడ వచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ పోలీసులు ఆయన వెనుకాలే చెన్నై ఎయిర్ పోర్టుకు వచ్చి చెక్ ఇన్ అయ్యే సమయంలో అరెస్టు చేశారు. ఎయిర్ పోర్టులో హంగామా చేశారు. దీంతో బీటెక్ రవి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఎందుకంటే వారు అరెస్టు చేసిన కేసు ఎప్పటిదో . అంతకు మించి ఆయన అంతకు ముందు పులివెందులలోనే ఉన్నారు. అక్కేడే అరెస్టు చేయవచ్చు. కానీ కొంత మంది కళ్లలో ఆనందం చూపించడానికి చేసిన అరెస్టు అది.
ఒక్క బీటెక్ రవి మాత్రమే కాదు… కింది స్థాయి టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలకూ అదే పరిస్థితి. నోటీసులు ఇస్తే స్టేషన్ లో హాజరవుతారు కానీ… అర్థరాత్రి ఇళ్లపై విరుచుకుపడి.. తలుపులు విరుగొట్టి తీసుకుపోయేవారు. ఇలాంటి ఘోరాలు ఎన్ని జరిగాయో లెక్కలేదు. ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అలాంటి పరిస్థితి ఎదురైతే… గింజుకుంటున్నారు. తన కొడుకుల్ని తీసుకుని దుబాయ్ పారిపోయేందుకు చెవిరెడ్డి బెంగళూరు వెళ్లారు. పులివర్తి నాని హత్యకు అసలు స్కెచ్ వేసింది మోహిత్ అని సాక్ష్యాలు దొరకడంతో ఎప్పుడైనా అరెస్టు చేస్తారని ఆయనకు తెలుసు. అందుకే దుబాయ్ కు పంపించేయడానికి రెడీ అయ్యారు. కానీ లుక్ ఔట్ నోటీసులు ఉన్నాయని గుర్తించలేక దొరికిపోయారు.
Read Also : చెవిరెడ్డి కొడుకు అరెస్ట్
ఇప్పుడు ఆయన గింజుకుంటున్నారు. తన కొడుకు సుప్రసిద్ధ లండన్ యూనివర్శిటీలో చదువుకున్నారని అంటున్నారు. లండన్ లో చదివినా.. చంద్రగిరిలో చదివినా సంస్కారం అనేది నేర్చుకోకపోతే.. ఎవరైనా ఒకటే . చెవిరెడ్డి పెంపకంలో ఆయన ప్రత్యర్థుల్ని చంపడానికి ప్లాన్ చేసుకునేంత బరితెగింపు తెచ్చుకున్నారు మరి. హత్యాయత్నం కేసు అదీ కూడా ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో… స్ట్రాంగ్ రూమ్ కు దగ్గరలో అదీ కూడా అభ్యర్థిపై చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడున్నది రాజారెడ్డి రాజ్యాంగం కాదు… న్యాయసంహిత.. తన పని తాను చేసుకుపోతుంది.