వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో కొంత మందికి నిద్ర పట్టడం లేదు. చేయకూడనన్ని తప్పులు చేసి ఇంత కాలం చల్లగా ఉన్న వారికి అసలు సెగ ఇప్పుడే ప్రారంభమయిది. ప్రభుత్వం ఇంత కాలం నెమ్మదిగా..నింపాదిగా వ్యవహరిస్తూ కూలింగ్ పీరియడ్ అన్నట్లుగా ఉంది. కానీ ఇప్పుడు అది ముగిసిపోయిందన్నట్లుగా రోజూ రెండు, మూడు షాకులు ఇస్తూ..కోలుకోలేని విధంగా దెబ్బకొడుతున్నారు.
ముందస్తు బెయిల్ రద్దు చేయించి మరీ పెద్దిరెడ్డి రైట్ హ్యాండ్ అరెస్టు
మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లను కాల్చివేసిన ఘటనలో మాధవరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. కానీ పోలీసులు దాన్ని క్యాన్సిల్ చేయించి మరీ అరెస్టు చేశారు. ఇలా చేస్తారని ఏ మాత్రం ఊహించలేకపోయాడు మాధవరెడ్డి. ఈయన పెద్దిరెడ్డి అక్రమాల గుట్టు విప్పడం ఖాయంగా కనిపిస్తోంది. మాధవరెడ్డి వాంగ్మూలం ఆధారంగా మరికొంత మందిని అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
వరుసగా అరెస్టులు -చర్యలు
ఐదు సంవత్సరాల పాటు జరిగిన రాజ్యాంగ వ్యతిరేక, నేరస్తుల పాలనపై వ్యతిరేకతతో ప్రజలు ఆ పార్టీని పాతాళంలోకి నెట్టేశారు. తమను చిత్ర హింసలు పెట్టిన వారి సంగతి తేల్చాలని ప్రజలు కూడా కోరుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నింపాదిగా వ్యవహరిస్తూ వస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. అయితే ప్రభుత్వం ఓ ప్రణాళికతో ఉందని స్పష్టమయింది. విడదల రజని మరిది అరెస్టు దగ్గర నుంచి పీవీ సునీల్ పై చార్జెస్ వరకూ అన్నీ ప్రణాళికాబద్దంగా, క్రమబద్ధంగా.. చట్టబద్దంగా జరిగిపోతున్నాయి. కింగ్ పిన్ ను పూర్తి స్థాయిలో బుక్ చేసే వరకూ ఇవి సాగిపోతాయి.
అసలు హీట్ ముందు ముందు ఉంది !
దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన వైసీపీ నేతలకు అసలు హీట్ ఇప్పుడే ప్రారంభమయింది. ఇప్పటికి బయట విస్తృతంగా ప్రచారం జరిగిన వారే అరెస్టు అవుతున్నారు. ప్రచారం లేకుండా దోపిడీలు, దాడులు చేసిన వారి సంగతి తేల్చాల్సి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం మందడుగు వేస్తే ప్రజలు కూడా మద్దతిస్తారు. నేరాలకు పాల్పడిన ఎవరూ చట్టం చేతుల నుంచి తప్పించుకోలేరని నిరూపించగలగాలి.