వైసీపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎన్నికల కోడ్ రెండు రోజుల్లో వస్తుంది.. కనీసం బిల్లులైనా ఇప్పించడి మహా ప్రభో అంటూ వందల మంది నేతలు.. ఎవరి స్థాయిలో వాళ్లు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ వస్తున్నారు.. ప్రభుత్వం మారితే పైసా కూడా ఇవ్వరని వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో అయితే ఇలాంటి సంప్రదాయం ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి టీడీపీ హయాంలో నిజాయితీ పనులు చేసిన వారికి కూడా బిల్లులు ఇవ్వకుండా కోర్టులకు వెళ్లేలా చేశారు ఈసారి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినా అదే చేస్తుంది.
ఈ కారణంగా పనులుు చేసినవైసీపీ ద్వితీయ శ్రేణి నేతలంతా తమకు బిల్లులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువగా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరుసరఫరా చేసిన వారు.. కరోనా సమయంలో ఫుడ్ సప్లయ్ చేసిన వారు సహా.. చిన్నా చితకా కాంట్రాక్టర్లు ఉన్నారు. వీరంతా వైసీపీ నేతలే. ఎమ్మెల్యేలు ఇతర నేతల ప్రోద్భలంతో టిక్కెట్లు దక్కించుకున్నవారే. ఇప్పుడు బిల్లులు రాకపోతే ఆర్థికంగా చితికిపోతామని ఆందోళన చెందుతున్నారు. వీరి కోసం ఎమ్మెల్యేలు.. ఆ పై స్థాయి నేతలు ఆర్థిక శాఖలో తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎంత బలమైన నేతతో చెప్పించుకుంటే అంత త్వరగా బిల్లులు వస్తాయన్నట్లుగా పరిస్థితి మారింది. సజ్జల రామకృష్ణారెడ్డి చీటి రాసిస్తే కొంత మందికి బిల్లులు వస్తున్నాయని చాలా మందికి ఆయన వద్దకు యాక్సెస్ ఉండటం లేని ఆందోళన చెందుతున్నారు. మొత్తం గా ఎన్నికలకు ముందు సొంత పార్టీ క్యాడర్ కు ఇవ్వాల్సిన బిల్లుల విషయంలోనూ జగన్ రెడ్డి టార్చర్ పెడుతున్నారని.. గగ్గోలు ప్రారంభం అయింది.