తిరుపతికి సమీపంలో ఉన్న విద్యానికేతన్ ను మోహన్ బాబు యూనివర్శిటీగా మార్చారు. అయితే ఈ విద్యా సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుండి భూముల వివాదాలు చుట్టు ముడుతూనే ఉన్నాయి. మోహన్ బాబుపై కబ్జా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మరోసారి అలాంటి వివాదం ఏర్పడింది. రంగంపేటలో ఓ భూమి ని ఆక్రమించుకునేందుకు ఎంబీయూ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. నాగపట్నం సర్వే నెంబర్ 10.2లో 35 సెంట్ల భూమిపై మోహన్ బాబు యూనివర్సిటీ నిర్వహకులు కన్నేశారని ఆరోపమలు వస్తున్నాయి.
ఆ భూమిపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరారు ఎంపీటీసీ, ఉపసర్పంచ్. 8 కోట్ల విలువైన భూమిపై సహ చట్టం కింద వివరాలు సేకరిస్తున్నామని వారిపై మోహన్ బాబు మనుషులు దాడులు చేస్తున్నారు. గతంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ భూమిలో ఇప్పుడు యూనివర్శిటీ పనులు జరుగుతున్నాయి. దీంతో ఎవరికైనా కేటాయించారా అని సహ చట్టం కింద దరఖాస్తు చేశారు. దాంతో మోహన్ బాబు మనుషులు హత్యాయత్నం చేశారని ఉపసర్పంచ్ , ఎంపీటీసీ మీడియా ముందు ఆరోపమలు చేశారు. దాడి చేసిన వారిలో హేమంత్ అనే యువకుడిని పట్టుకొని బోస్ చంద్రారెడ్డి అనుచరులు చంద్రగిరి పోలీసులకు అప్పగించారు.
చంద్రగిరిలోని మోహన్ బాబు యూనివర్సిటీ పీఆర్ఓ సతీష్, మంచు అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి….తమ ఫోటోలను నిందితులకు పంపించి.. దాడికి సుపారి ఇచ్చారన్నారు. నిందితుడి నుంచి కర్రలు, కత్తి, పెట్రోల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు . సినీ నటుడు మోహన్ బాబు, పీఆర్వో సతీష్, సునీల్ చక్రవర్తి వల్ల మాకు ప్రాణహాని ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు. రంగంపేట లో బాధితులతో పాటు గ్రామస్తులు కూడా ధర్నా చేశారు. ఎంబీ యూనివర్సిటీ అరాచకాలు నశించాలని.. మోహన్ బాబు డౌన్ డౌన్ అనే నినాదాలు చేశారు.