హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించుటలేదని, మా సమస్యలు ఎవరితో చెప్పుకోవాలని … కొంత మంది హిజ్రాలను ముందు పెట్టి వైఎస్ఆర్సీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ్ఫిర్యాదు చేశారు. అయితే వీరంతా పూర్తిగా వైఎస్ఆర్సీపీ కాదు. హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీలో నాలుగు వర్గాలుంటాయి. అందులో వీరు ఇక్బాల్ అనే ఎమ్మెల్సీ వర్గం. వీరంతా తమ నాయకుడి దృష్టిలో పడాలనో.. తమ నాయకుడు చెప్పాడనో అప్పుడప్పుడూ ఇలాంటివి చేస్తూంటారు.
అసలు విషయం ఏమిటంటే .. ఎమ్మెల్సీగా ఉన్న .. హిందూపురం వైసీపీ ఇంచార్జ్ ఇక్బాల్ కూడా లోకల్ కాదు. ఆయనది కర్నూలు. మాజీ ఐపీఎస్ అయిన ఆయన… చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీస్‌గా కూడా చేశారు. కానీ తర్వాత వైసీపీలో చేరారు. గత ఎన్నికలకు ముందు చివరి క్షణంలో హిందూపురం టిక్కెట్ ఇచ్చారు. ఆయన ఓడిపోయారు. అయితే ఇంచార్జ్ గా ఆయనే ఉంటున్నారు. ఆయన ఉన్నారన్న పేరే కానీ.. ఎప్పుడో ఓ సారి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తూంటారు.
అలాంటి ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్యే హిందూపురంలో కనిపించడం లేదని అనుచరులతో ఫిర్యాదులు చేయించారు. నాన్ లోకల్ అయిన ఇక్బాల్‌కు అదే నినాదంతో వైఎస్ఆర్సీపీ నేతల్లో మూడు వర్గాలు దూరంగా ఉంటాయి. హిందూపురం నుంచి గెలిచిన బాలకృష్ణ .. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు నిధులు ఎలాగూ రావడం లేదు. అయితే ఆయన పీఏల ద్వారానే ఎక్కువ పనులు చక్క బెడుతూంటారు. హిందూపురానికి ఎమ్మెల్యే అయినా అధికార పార్టీ ఇంచార్జ్ అయినా స్థానికేతరులే . కానీ వాళ్లే్ మళ్లీ కనిపించడం లేదనే రాజకీయ కంప్లైంట్లు చేస్తూ ఉంటారు.