వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆత్మకూరులోనూ ఇబ్బందికరంగా మారింది అక్కడ పోటీ లేదు. బీజేపీ పోటీ ఉన్నా పట్టించుకునేవారు లేరు. కానీ ఆ పార్టీ నేతలు ఇంటింటికి తిరిగి డబ్బులు కూడా పంచుతున్నారు. వైసీపీ క్యాడర్ అధికారం వచ్చిన తర్వాత మూడు వర్గాలుగా విడిపోయారు. ఒకరంటే ఒకరికి పడటం లేదు. చివరికి మేకపాటి కుటుంబంలోనూ మూడు వర్గాలు తయారయ్యాయి. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి సోదరుల్లో ఒకరైన చంద్రశేఖర్ రెడ్డి ప్రచారానికి రావడం లేదు.
మరో వైపు మంత్రుల్ని.. ఎమ్మెల్యేల్ని ఇంచార్జులుగా నియమించినా చాలా మంది అటువైపు చూడటం లేదు. వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతున్నారు. మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్లకూ బాధ్యతలిచ్చారు. వారు అక్కడ కనిపించడం కష్టమైపోయింది. మరో వైపు వయోభారం కారణంగా మేకపాటిరాజమోహన్ రెడ్డి మొత్తం అన్ని పనులు చూసుకోలేకపోతున్నారు. విక్రమ్ రెడ్డి ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకూ సమాధానాలు చెప్పలేకపోతున్నారు. దీంతో పరిస్థితి తేడాగా ఉంది.
నియోజవర్గ ఓటర్లలో పోలింగ్‌లో పాల్గొనాలన్న ఆసక్తి కూడా పెద్దగా కనిపించడం లేదు. లక్ష ఓట్ల మెజార్టీని టార్గెట్‌గా వైసీపీ హైకమాండ్ పెట్టింది. పోటీ లేని ఎన్నికలో ఆ మాత్రం ఓట్లు సాధించకపోతే పరువు పోతుందన్న ఆందోళననలో ఉన్నారు. మెజార్టీతగ్గితే ప్రజా వ్యతిరేకత కంచుకోటలోనూ ఎంత తీవ్రంగా ఉందో బయటపడిందని.. ఇక ఇక ితర చోట్ల పరిస్థితి ఏమిటన్న విశ్లేషణలు వస్తాయి. దీంతో వైసీపీ నేతలు డబ్బులు కూడా పంచుతున్నారు. ఇలా డబ్బులు పంచుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయినా వైసీపీ నేతలు మాత్రం తగ్గడం లేదు. ఎలాగూ వాలంటీర్లు తమ చేతుల్లో ఉంటారు కాబట్టి వారితో ఓటర్లను బూత్‌లకు రప్పించుకోవాలని ప్లాన్ చేశారు.
బీజేపీ నేతలకు గెలుపుపై ఎలాంటివిశ్వాసం లేదు కానీ బద్వేలులోలా కనీసం ఇరవై వేల ఓట్లు తెచ్చుకుంటే బలపడ్డామని చెప్పుకోవచ్చని అనుకుంటున్నారు. అయితే వారి కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు వస్తాయన్న ప్రచారం కూడా ఆత్మకూరులో జరుగుతోంది. ఓటింగ్‌లో పాల్గొన్నా… నోటాకే ఓటు వేయాలన్న ఓ అంతర్గత ప్రచారం ఆత్మకూరులో జరుగుతోంది.