ఏపీ పోలీసులు పూర్తిగా వైసీపీ నేతల కాళ్ల దగ్గర పడిపోయారు. సీఎం జగన్ రెడ్డి దగ్గరో . అనధికారిక పోలీస్ బాస్ గా వ్యవహరిస్తున్న సజ్జల దగ్గరో ఇలా వ్యవహరిస్తే.. పోనీలే పోస్టింగ్‌ల కోసం దిగజారిపోయారు అనుకోవచ్చు.. కానీ ఓ చిన్న కార్పొరేటర్, వార్డు వాలంటీర్ల ముందు కూడా సారగిలపడిపోవాల్సి వచ్చింది. తమను కొట్టిన చివరికి మహిళా పోలీసుల్ని కొట్టినా ఏమీ చేయలేక… బెయిలబుల్ సెక్షన్లు పెట్టి నిందితుల్ని ఇంటికి పంపించేశారు. వీడియోలు ఉన్నాయి కాబట్టి ఇవైనా పెట్టారు అవి కూడా లేకపోతే… పోలీసులే వాళ్ల కాళ్లు పట్టుకోవాల్సి వచ్చేదేమో అన్న ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అనుచరులు దొంగ మద్యం వ్యాపారం చేస్తూంటారు. వీరిలో ఒకరు గుజ్జల సురేశ్. ఎమ్మెల్యే సిండికేట్ లో ఈ దొంగ మద్యం అమ్మేవాళ్లు ఓ భాగం. అలాంటి సిండికేట్‌లో సురేష్ ఒకరు. సురేశ్ అక్రమంగా మద్యం విక్రయిస్తుండటంతో సెబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి 96 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అంతే.. వైసీపీ నేతలు బుధవారం రాత్రి సెబ్ పోలీసులపైనే దాడి చేశారు. ఓ మహిళా కానిస్టేబుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. 32వ డివిజన్ కార్పొరేటర్ సాకే చంద్రశేఖర్, మరో కార్పొరేటర్ కమల్ భూషణ్ సుమారు పాతిక మందితో కలిసి గుల్జార్‌పేటలోని సెబ్ స్టేషన్ పై దాడి చేశారు.
కార్పొరేటర్ సాకే చంద్రశేఖర్ ఎస్ఐ కుర్చీలో కూర్చున్నారు. ప్రశ్నించిన మహిలా కానిస్టేబుల్ పై దాడి చేశారు. మధ్యలోకి వచ్చిన ఎస్ఐ మునిస్వామిపై వైసీపీ వర్గీయులు చేయిచేసుకున్నారు. ఆయనను కిందకు తోసేశారు. నిందితుడు సురేశ్ తండ్రి ఆమె డ్రస్ లాగేశారు. ఆమె తలపై దాడి చేశాడు. హెడ్ కానిస్టేబుల్ శేఖర్ అడ్డుకోవడంతో ఆయనపైనా దాడి చేశారు.
ఇంత జరుగిన తర్వాత కూడా నిందితులపై బెయిలబుల్ కేసులు పెట్టారు. నిందితుల్ని పంపించేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీసు వర్గాల్లోనూ విస్మయం రేపుతోంది. తప్పుడు కేసులు పెట్టి ఇప్పటికే ప్రజల్లో పలుచన అవుతున్న డిపార్టుమెంట్ .. ఈ వ్యవహారంతో మరింత దిగాజరిపోతోందని… ఇక పోలీసులకు ప్రజల్లో ఎక్కడ విలువ ఉంటుందన్న ఆవేదన కనిపిస్తోంది. వ్యవస్థను .. వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన పెద్దలు ఇప్పటికీ తమ పోస్టింగ్ తమకు ఉందని… హాయిగా ఉంటున్నారు.