ప్రజలిచ్చిన అధికారాన్ని దోపిడికి దగ్గర మార్గంగా చేసుకుని దేవుడంటే కనీసం భయం , భక్తి లేకుండా చేసిన వ్యవహారాలు వెలుగులోకి వస్తూంటే… వైసీపీ నేతలకు ఫ్రస్ట్రేషన్ వస్తోంది. ఏమని సమాధానం చెప్పాలో తెలియక,.. కిందా మీద పడుతున్నారు. చివరికి బూతులు అందుకునేందుకే సిద్ధమయ్యారు. జగన్ రెడ్డి తనకు ఇచ్చిన స్క్రిప్టులు చదివి.. ఆయనకు ఏమీ తెలియదని … జాతీయ మీడియా కూడా సర్టిఫికెట్ ఇచ్చేశాక బెంగళూరు వెళ్లిపోయారు. ఆయనకు తెలిసింది తిట్టమని చెప్పడం . అలా పెద్ద నోరున్న నోళ్లన్నింటికీ ఆదేశాలిచ్చారు. రోజా, లక్ష్మిపార్వతి లాంటి వాళ్లు వీడియోలు రిలీజ్ చేశారు. వారి ఫ్రస్ట్రేషన్ తరహా మాటలు చూసి.. వైసీపీని మరింత అసహ్యించుకుంటారు కానీ ఎవరైనా సమర్థిస్తారా ?. వారి మాటల వల్లే ఇప్పుడీ స్థితిలో ఉన్నారు. మళ్లీ వాళ్లనే దింపారు. పరువు తక్కువ మాటలు మాట్లాడించుకున్నారు.
జగన్ రెడ్డి తనను ఈ విషయంలో ఇలా ఇరికించేస్తారని అనుకోలేదు. కేసులు పెడతారని.. సన్నిహితులని అరెస్టు చేస్తారని.. మరో రకంగా అనుకున్నారు. కానీ చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం చేస్తానంటే.. ఈ కోణంలో వస్తారని అసలు ఊహించలేకపోయారు. తిరుపతి ప్రసాదం విషయంలో ఏం జరిగినా చంద్రబాబు బయట పెట్టరని అనుకున్నారు. చంద్రబాబు ఆలయ ప్రతిష్టను చూసుకున గుంభనంగా ఉంచుతారని బయటపడిన తర్వాత జాగ్రత్తు తీసుకుంటారని అనుకున్నారు. కానీ బయట పెట్టకపోతే…,. తర్వాత కూడా ఇలాంటివి కొనసాగుతాయని.. చెక్ పెట్టాల్సిందేనని.. బయట పెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా హిందువుల్లో గగ్గోలు రేగింది. ఇంత రియాక్షన్ వస్తుందని ఊహించలేకపోయిన వైసీపీకి ఎలా సమర్థించుకోవాలో ఆర్థం కావడం లేదు.
నెయ్యి టెండర్లు, రివర్స్ టెండర్లలో చేసిన అక్రమాల దగ్గర నుంచి మొత్తం వెలుగులోకి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో సిట్ ఈ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. దీంతో వైసీపీ ఫ్రస్ట్రేషన్ అసలు తగ్గడం లేదు. సీబీఐ విచారణ.. సిట్టింగ్ జడ్జి విచారణ అంటూ కోర్టులకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ.. వైసీపీకి తెలుసు ఇవన్నీ తమ భయాన్ని కాస్తంత కంట్రోల్ చేసుకోవడానికే కానీ.. తప్పించుకోవడం కష్టమని . ఇప్పుడు వైసీపీ వాదనను అసలు ప్రజలు వినేందుకు సిద్దపడటం లేదు. వారు చెప్పేవన్నీ అబద్దాలేనని క్లరిటీ వచ్చింది. సాక్షి పత్రికను చూసేవారు..కొనేవారు లేరు. సాక్షిచానల్ ఏపీలో ప్రసారం కాదు. ఆన్ లైన్ లో చూడరు.
అందుకే.. తమ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి బూతులందుకుంటున్నారు నేతులు.కానీ వారికీ సరైన సమయం రాబోతోందని… ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని టీడీపీ నేతలు.. సెటైర్లు వేస్తున్నారు.