పోసాని కృష్ణమురళి తాజా ఉదాహరణ. ప్రజారాజ్యంలో చేరి నీతి మాటలు చెప్పారు. జీవితాంతం తన లీడర్ చిరంజీవే అన్నారు. తర్వాత జగన్ పంచన చేశారు. ఆయన జగన్ పంచన చేరడానికి.. బోయపాటి లాంటివారికి చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యత కారణం అని చెబుతారు. ఏదైనా కానీ జగన్ పంచన చేరారు. ఇలా ఈర్ష్యాద్వేషాలతో తన వైపు వచ్చిన వారిని ఎలా వాడుకోవాలో జగన్ కు బాగా తెలుసు. వారి జీవితాలను పణంగా పెట్టేసి తన మానసిక ఆనందం పొందడానికి ఇతర నేతల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి వీరిని పావుగా వాడుకుంటారు.
రాజకీయ ప్రత్యర్థుల్ని బూతులు తిట్టించడం జగన్ నైజం
“అమ్మాయ్.. చంద్రబాబును బాగా తిట్టమంటున్నాడు” అని ఓ ప్లీనరీ వేదిక మీద రోజాకు పెద్దాయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏ మాత్రం సిగ్గుపడకుండా వచ్చి చెప్పిన విషయం మైక్ ఆన్ లో ఉండటంతో అందరికీ వినిపించింది. అప్పుడే అందరికీ వైసీపీ నేతలు ఎందుకు అలా బూతులు మాట్లాడతారో.. క్లారిటీ వచ్చింది. రోజా అయినా.. కొడాలి అయినా.. వల్లభనేని అయినా టీడీపీలో ఉన్నప్పుడు పద్దతిగానే ఉన్నారు. కానీ వైసీపీలోకి వెళ్లిన తర్వాత ఏమయ్యారు?. బీప్ సౌండ్ల లీడర్లు అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా స్వయంగా ఆయన సీఎం చైర్లో కూర్చుని కలెక్టర్ల లాంటి వాళ్లకు కూడా టీడీపీ నేతల్ని తిట్టాలని చెప్పారు.
అదేం మానసిక ఆనందమో?
రాజకీయ ప్రత్యర్థుల్ని బూతులు తిడితే.. ఇంట్లో వాళ్లకు అక్రమ సంబంధాలు అంటగడితే.. పుట్టుకల్ని ప్రశ్నిస్తే జగన్ రెడ్డికి ఆనందం. తట్టుకోలేనంత సంతోషం. అలాంటి సంతోషం కల్పించిన వారికి ఆయన పదవులు ఇస్తారు. అందుకే వైసీపీలో పోటీ పడి మరీ తమ ప్రతిభను ప్రదర్శించి చిన్నా చితకా పదవులు పొందారు. పోసానికి కూడా చివరికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిని చివరిలో పడేశారు. కాని భూమి గుండ్రంగా ఉంటుంది. ఇవాళ తిడితే రేపు దెబ్బలు తినేది కూడా తామేనని.. జగన్ కాదని వీరు గుర్తించలేకపోయారు. ఫలితంగా అనుభవిస్తున్నారు.
కుటుంబాలను రిస్క్‌లో పెట్టుకున్న వైసీపీ నేతలు
జగన్ రెడ్డి వికృత ఆనందం కోసం దాడులు చేసి.. తిట్టిన వారంతా ఇప్పుడు మానసికంగా వేదన పడుతున్నారు. కుటుంబాలకు టెన్షన్ మిగిలిస్తున్నారు. పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకోవడానికి వచ్చినప్పుడు పోలీసు ఎదుట ఆయన చేసిన ఓవరాక్షన్.. పడిన టెన్షన్ చూస్తే.. జగన్ రెడ్డికి కూడా ఆనందంగా ఉంటుందేమో ?. ఎందుకంటే ఆయన మనస్థత్వం వేరే వాళ్లు ఇలా కష్టాలు పడుతూంటే చూసి ఆనందించడమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు పడ్డారు. అధికారంలోకి వచ్చాక చట్టపరంగా కూడా చర్యలు తీసుకోకపోతే చేతకానితనం అనుకుంటారు. వీళ్ల గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అనుకోవచ్చు.. కానీ ఏ చర్యలు తీసుకోకపోతే చేతకానితనం అని వీరు పదే పదే రెచ్చగొడతారు. తప్పదు. ఎవర్నీ వదలకపోవచ్చు.