చంద్రబాబు, పపవన్ కల్యాణ్ తో పాటు ఆయన కుటుంబాలను బూతులు తిట్టడం జగన్ కు ఇష్టమని అలా తిడితేనే ఆయన పదవులు ఇస్తారని వైసీపీలో ఓ అర్హత పాయింట్. అందుకే పదవుల కోసం కొంత మంది లీడర్లు బూతుల మాస్టర్లుగా మారిపోయారు. అలాంటి వారికి ఇప్పుడు జగన్ రెడ్డి సర్వేల పేరు చెప్పి టిక్కెట్లు నిరాకరించే ఆలోచనలో ఉన్నారు. మెల్లగా ఒక్కొక్క పేరు లీక్ చేస్తూ.. వారు టెన్షన్ పడుతూంటే.. తాను చిద్విలాసంగా ఉన్నారు. ఇప్పుడు ఆ బూతులీడర్లకు మరో దారి లేదు.. జగన్ రెడ్డి ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయాలి… టిక్కెట్ లేదంటే మూసుకుని కూర్చోవాలి. నోరెత్తడానికి చాన్స్ లేదు. ఎందుకంటే వారికి మరో పార్టీలో అవకాశాలు రావు.
కొడాలి నాని, వంశీలకు చుక్కలు చూపిస్తున్న జగన్ రెడ్డి
చంద్రబాబు కుటుంబంపై దారుణ వ్యాఖ్యలు చేసి ఆయన కళ్ల వెంట నీళ్లు తెప్పించడంలో కొడాలి నాని, వంశీలది కీలక పాత్ర . వారు చేసిన పనుల వల్ల వైసీపీకి ఎంత డ్యామేజ్ అయిందో ఇంకా గుర్తించారో లేదో కానీ ఇప్పుడీ ఇద్దరికి టిక్కెట్లపై జగన్ నాన్చుతున్నారు. కొడాలి నానికి ఇంకా టిక్కెట్ ఖరారు చేయకపోగా.. ఆయనను గన్నవరం పంపుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. గుడివాడలో రెండు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఒకటి మండల హనుమంతరావు రెండు మెరుగుమాల కాళీ. ఈ ఇద్దరిలో ఒకరు గుడివాడ అభ్యర్థి అవుతారు. కొడాలి నాని గన్నవరం వెళ్తారు. వంశీ ఆసక్తి చూపిస్తే విజయవాడ ఎంపీ టిక్కెట్ ఇస్తారు. దానికి తగ్గట్లుగా ఆ లీడర్లను మానసికంగా సిద్ధం చేసేందుకు లీకులు ఇచ్చారు. దీన్ని ఆపేందుకు గుడివాడ సీటు తనదేనని ప్రకటించుకునేందుకు కొడాలి నాని తాపత్రయ పడుతున్నారు. టెన్షన్ పడుతున్నారు. సోమవారం తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేంత టెన్షన్ తో ఆయన తిరుగుతూ కనిపించారు.
రోజా, జోగి రమేష్లకు చివరకు మొండి చేయే !
మహిళా నేతల్లో రోజా నోటి దుర్వాసన గురించి చెప్పాల్సిన పని లేదు. ఆమె మాటలు వింటే … చాలా మందికి రాజకీయ నేతలకు ఇంత స్వేచ్చ ఉంటుదా.. అని ఆశ్చర్యపోతారు. అయితే జగన్ రెడ్డికి తాను ఎంతో విశ్వాసపాత్రురాలినని చెప్పుకోవడానికే ఈ భాష ఆమో ప్రయోగిస్తారు. కానీ ఇదేమీ ఆమె టిక్కెట్ ను కాపాడలేకపోతున్నాయి. నగరికి ఎవరూ లేరని రోజా అనుకుంటున్నారు కానీ.. పెద్దిరెడ్డి అనుకుంటే తానే పోటీ చేయగలరన్న సంగతిని మర్చిపోతున్నారు . ఇక జోగి రమేష్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఆయన అసెంబ్లీలోనే అందర్నీ బూతులు తిట్టిన ఘటన. ఆయన సిట్టింగ్ స్థానం ఊడబీకి పెనుమలూరు ఇచ్చారు. అక్కడ కూడా వేరే అభ్యర్థులు ఇప్పుడు తెరపైకి వస్తున్నారు.
బూతుల జోలికి వెళ్లని నేతలు రిలాక్స్
జగన్ రెడ్డికి నమ్మకం కలిగించడం కోసం.. బూతులు తిట్టాలన్న సూచనలు పాటించని వారు.. చాలా మంది రిలాక్స్ గా ఉన్నారు. జగన్ రెడ్డి టిక్కెట్ ఇవ్వకపోతే..యధేచ్చగా మరో పార్టీలోకి వెళ్లే స్వేచ్చ వారికి ఉంది. కానీ బూతుల నేతలకు మాత్రం మరో చాయిస్ లేదు. వారిని ఏ పార్టీలోకి తీసుకోరు .. జగన్ రెడ్డి చాన్సిస్తే పోటీ చేయడం లేకపోతే లేదు. రేపు ప్రభుత్వం మారితే… తమను తాము కాపాడుకోవడం కోసం ఆజ్ఞాతంలోకి పోవాల్సిన పరిస్థితి.