టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. ఆ పార్టీ చేసే విధానాలపై విమర్శలు చేస్తే .. ప్రత్యర్థి అనుకోవచ్చు. కానీ వైసీపీ నేతల రాజకీయమే వేరు. వారు ఫ్లెక్సీల్లో బాలకృష్ణకు ఫోటో లేదని ఏడుస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ సస్పెన్షన్ ఎత్తి వేయాలని విచిత్రమైన డిమాండ్లు చేస్తున్నారు.. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారు. వారి తీరు చూసి.. పాపం వైసీపీ నేతలకు.. టీడీపీ మీద ఇంత అభిమానమేంటి అనుకుంటున్నారు.
వైసీపీ ప్లీనరీ అంటే జరిగేది వేరు. టీడీపీ ప్లీనరీ అటే జరిగేది వేరు. ఆ విషయం వైసీపీ నేతలకు తెలుసు. వైసీపీలో ప్లీనరీ అంటే.. ఏమీ ఉండదు.. చంద్రబాబును తిట్టడం. ఏ రేంజ్ లో తిట్టాలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా స్టేజి మీద కూర్చుని ఉమ్మారెడ్డి వంటి వారితో ఆదేశాలు ఇస్తూ ఉంటారు. అయితే టీడీపీ ప్లీనరీలో ఉండేది వేరు. ఇలాంటి మహానాడు వల్లే.. సైబరాబాద్ మొక్కను అని చెప్పుకుని విడదల రజనీ లాంటి రాజకీయ నేత పుట్టుకొచ్చారు. ఆమె టీడీపీలో ఉండకపోవచ్చు.. జగన్ తీరుపై మండిపడే రాజకీయాల్లోకి పైకి వచ్చారు. అందుకే..మహానాడుపై.. వైసీపీ నేతలకు చాలా కోపం ఉంటుంది.
ఓ పద్దదిగా జరిగిపోయే మహానాడుల గురించి ప్రారంభం కాక ముందేనోరు పారేసుకోవడానికి రెడీగా ఉంటారు. నేతల్ని వ్యక్తిగతంగా తిట్టడం..తిట్టించుకోవడం కామన్ అయిపోతోంది. అయితే ప్రజలు కూడా.. వాళ్లు సంబరం చేసుకుంటే.. వైసీపీకి నొప్పేంటి.. ఇలా నోటి విరేచనాలు చేసుకోవడం ఏమిటన్న ప్రశ్న సహజంగానే వేసుకుంటారు . బయటకు చెప్పలేకపోవచ్చు కానీ మనసులో అయితే అదే ఉండిపోతుంది. ఫలితం తర్వాత కనిపిస్తుంది.