హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతోంది. హ్యాట్రిక్ విజయంతో తిరుగులేని పట్టు సాధించిన బాలకృష్ణ సమక్షంలో మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. మున్సిపల్ చైర్ పర్సన ఇంద్రజ కూడా బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి డబ్బు రాజకీయంతో చేజారిపోయిన మున్సిపాలిటీగా ఇప్పుడు మళ్లీ టీడీపీ జెండా ఎగిరినట్లయింది.
కుప్పంలో చంద్రబాబును… హిందూపురంలో బాలకృష్ణను ఓడించడానికి మంత్రి పెద్దిరెడ్డి కోట్లను మంచినీళ్లలా ఖర్చు చేశారు. హిందూపురంలో ఆయన ఎన్నికలకు ముందు రోజుల తరబడి మకాం వేసేవారు. కొత్త కొత్త ఇంచార్జుల్ని తెచ్చారు. ఓ సారి వారం రోజుల పాటు హిందూపురంలో మకాం వేసి.. మండలాల వారీగా టీడీపీ నేతలు బేరం పెట్టి పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించారు. డబ్బు రాజకీయంలో బాలకృష్ణ వెనుకబడినట్లే అనుకున్నారు. కానీ రాజకీయాలను డబ్బులు శాసించలేవని బాలకృష్ణ మరోసారి మెజార్టీ పెంచుకుని నిరూపించారు.
ఇప్పుడు పెద్దిరెడ్డి పుంగనూరుకే పోలేకపోతున్నారు.. ఇక హిందూపురం నుంచి పట్టించుకునే పరిస్థితి లేదు. హిందూపురం వైసీపీ నేలంతా తలో దిక్కుకుపోయారు. ఎంపీగా పోటీ చేసిన శాంతమ్మ బళ్లారికి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన దీపికా రెడ్డి బెంగళూరు వెళ్లిపోయారు. మేము లోకల్ అనుకుంటున్న వారు బయటకు వస్తే.. కష్టమని సైలెంట్ అయ్యారు. పదవులు కాపాడుకోవాలనుకుంటున్నవారు టీడీపీలో చేరిపోతున్నారు. ఎలాంటి రాజకీయాలు చేయకూడదో అలాంటివి వైసీపీ .. హిందూపురంలో చేసింది. దానికి తగ్గ ప్రతిఫలాన్ని కూడ ఆ పార్టీనే అనుభవిస్తోంది.