ఏపీని నాలుగు భాగాలుగా విడగొట్టి నలుగురు రెడ్లకు పంచారని వారంతా ఆ ప్రాంతాలను దోచేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలను టీడీపీ చాలా కాలంగా చేస్తోంది. వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి ఆ నలుగురు. అయితే ఇప్పుడు వారంతా తమ తమ ప్రాంతాల్లోనే కాదు.. స్వయం ప్రకటిత రాజధాని విశాఖను.. ఓపెన్ జోన్‌గా ప్రకటించుకుని అక్కడ విస్తృతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో వివాదాస్పద డీల్స్ చేసకుకుంటున్నారు. ఈ విషయంలో బయటకు వస్తున్న విషయాలు ప్రజలను సైతం ఆశ్చర్య పరుస్తున్నాయి.
తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే రాజ్యసభ ఎంపీకి చెందిన సంస్థ చేసిన క్విడ్ ప్రో కో తరహా ఒప్పందం ఇప్పుడు కలకలంగా మారింది. ఓ కంపెనీతో నిర్మాణ ఒప్పందం చేసుకుని ఆ సంస్థకు కేవలం30 శాతం ఇచ్చి ..డెభ్బై శాతం తాము తీసుకోడం. ఇదే సంస్థకు రుషికొండ దగ్గర భూములు కేటాయించడం ఇక్కడ ట్విస్ట్. ఇదేందయ్యా.. వేమిరెడ్డి అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తే.. వ్యాపారం అంటే అంతే అంటూ సమాధానమిస్తున్నారు.
ఇంతకు ముందు విజయసాయిరెడ్డి .. తన కుమార్తె, అల్లుడి కంపెనీ పేరుతో వందల ఎకరలు కొన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇక సీఎంజగన్మోహన్ రెడ్డి సమీప బంధువు విల్లాసంపేరుతోపెద్ద విల్లా ప్రాజెక్ట కట్టేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి కొత్తగా ఉత్తరాంధ్రకు ఇంచార్జ్‌గా వచ్చారు కానీ.. ఆయన లీలలు వైఎస్ హయాంలోనే వెలుగు చూశాయి. ఇప్పుడు మళ్లీ బయటపడే వరకూ ఎన్నిచేశారో తేలాల్సి ఉంది.
విశాఖ భూ దందాల్లో ఎక్కడా పేరు బయటకు రానిది సజ్జల రామకృష్ణారెడ్డి గురించే. అందరి గురించి అత్యంత రహస్యమైన విషయాలుకూడా వెలుగులోకి వస్తున్నాయి కానీ.. సజ్జల ఏం చేస్తున్నారో మాత్రం బయటకురాదు. అయితే ఇంటలిజెన్స్ ఇతర వ్యవస్థలు అన్నీ ఆయన గుుప్పిట్లో ఉన్నాయని…వాటిపై ఆయన ప్రభావం తర్వాత ఆయన ఘన కార్యాలన్నీ వెలుగులోకి వస్తాయన్న ఓ అభిప్రాయాన్ని వైసీపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు.