ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని చెబుతున్నారు. కానీ గెజిట్ ప్రకటిస్తేనే అమల్లోకి వచ్చినట్లు. గత ఏడాదే గెజిట్ ప్రకటించారు. అంతేనా.. సర్వేలు చేసి శాశ్వత భూరక్ష అంటూ జగన్ ఫోటోలతో పాస్ బుక్లు కూడా పంపిణీ చేస్తున్నారు. అంటే ఇవి ఆ చట్టం ప్రకారం ఇస్తున్నవే. అమల్లో ఉన్న చట్టం ద్వారా ఇవన్నీ చేస్తూంటే.. ఎందుకు ఇంకా అమలు చేయడం లేదని అబద్దాలు చెబుతున్నారు ?
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలు ఎలా మంచిదో చెప్పడం లేదు. వివాదాలు పరిష్కరించాలని అనుకుంటారు కానీ ఆ పేరుతో వైసీపీ నేతలు తమ భూమూల్ని కబ్జాలు చేయాలని ఏ రైతు కోరుకోడు. కానీ ఇక్కడ తమ భూములకు వివాదాల్లోకి నెట్టి వాటిని తమ పేర రాయించుకుని న్యాయపోరంగా పోరాడే పరిస్థితి లేదని రైతులకు క్లారిటీ వచ్చింది. అందుకే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీన్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకే అమలు చేయడం లేదని బొంకుతోంది. ఫోర్స్ లో ఉన్న చట్టాన్ని అమలు చేయడం లేదని చెప్పడం కన్నా దారుణం ఏముంటుంది ?. అది ఈ ప్రభుత్వానికే సాధ్యం.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఎంత ప్రమాదకరమో లాయర్లు ఇతర నిపుణులు వివరిస్తూ.. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఓ ప్రభుత్వం ఇంత దిగజారుడుగా వ్యవహరిస్తూ ప్రజల ఆస్తులపై కన్నేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారని.. పథకాల పేరుతో తాము చేసే రాజకీయానికి పడిపోతారని అనుకుంటున్నారు. కానీ కర్రు కాల్చి వాత పెట్టబోతున్నారని తేలుతోంది.