వైసీపీకి.. ఆ పార్టీ అగ్రనేతలకు తెలిసింది రాజకీయం అంటే చీప్ .. చీప్ టెక్నిక్కులే. కులాల పేరుతో తప్పుడు ప్రచారం.. దాడులు చేయడం.. హత్యలకు పాల్పడటం వంటివి చేయడమే కాదు ఇప్పుడు మరింత దిగజారిపోయారు. జనసేన వేషం వేసుకుని పవన్ కల్యాణ్ ను పొగిడి ఎలాగైనా కూటమి పార్టీల మధ్య విబేధాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
వారి మిషన్ ఇప్పుడు కూటమి నుంచి పవన్ కల్యాణ్ ను తప్పించడమే. అందు కోసం.. పవన్ ను పొగిడేందుకు సిద్దపడుతున్నారు. అన్నా.. మిమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ కొత్తగా సానుభూతి నాటకాలు ప్రారంభించారు. జనసేన పేరుతో ఓ సోషల్ మీడియా సైన్యాన్ని ఎప్పుడూ పోషిస్తూనే ఉంటుంది వైసీపీ. ఇప్పుడు వారిని ఫీల్డ్ లోకి తీసుకెళ్లింది. కడపలో ఓ ఫ్లెక్సీ పెట్టారు. దావోస్ కు తీసుకెళ్లలేదు.. ఒక్క ఎంవోయూ చేసుకోలేదు.. అదే పవన్ వెళ్లి ఉంటే లక్షల కోట్లు వచ్చేవి అని. లోకేష్ ఇమేజ్ పెంచేందుకు దావోస్ టూర్ కు తీసుకెళ్లారని.. ఇలాంటి కూటమిలో ఉండాల్సిన అవసరం ఉందా అని చెప్పారు. అదే వ్యక్తి వైసీపీని ఏం పీకలేరు అని.. మరో ఫ్లెక్సీ వేసి దొరికిపోయారు. ఇలాంటి సిల్లీ చేష్టలపై వైసీపీ నమ్మకం పెట్టుకుంది.
వైసీపీ నాయకత్వానికి తెలియనిది ఏమిటంటే.. తమ పార్టీ నేతలకు ఎంత ఎక్కువగా జనసేన వేషం వేస్తే.. అంత ఎక్కువగా వారు ఆ పార్టీ వైపు. వెళ్తారు అనేది సహజమైన విషయం. జనసేన పార్టీని కూటమి నుంచి బయటకు తీసుకు వస్తారో లేదో అది భవిష్యత్ కానీ.. అసలు వైసీపీకి భవిష్యతే లేకుండా పోతుందన్నది నిజం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైసీపీలో నేతలు మిగలరు. వారిలో అత్యధికం జనసేనలో చేరుతారు.