పులకేశి సినిమా నిజంగా చూడని వాళ్లకు కూడా ముఖ్యంగా వైసీపీ నేతలకు తమ అధినేతలో పులకేశీ గుర్తుకు వస్తున్నారు. అసలు ఏ నిర్ణయం ఎందుకు తీసుకుంటారో తెలియని పరిస్థితిలో అందరూ కిందా మీదా పడిపోతున్నారు. ఏ నిర్ణయాలు ఏ సమీకరణాలు కింద తీసుకుంటున్నారో అసలు ఏ సామాజిక సమీకరణాల లెక్కలో వేస్తున్నారో ఎవరికీ తెలియని నేతల్ని ఎందుకు సమన్వయకర్తలుగా ఎందుకు నియమిస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. లాటరీ వేసినట్లుగా అభ్యర్థుల నిర్ణయం అనంతపురంలో ఎంపీ స్థానాలకు ఖరారు చేసిన అభ్యర్థుల్ని చూసి జగన్ రెడ్డి సోషల్ ఇంజినీర్ అనుకున్నాం కానీ.. ఆన్ క్లాసుల్లో పాసైన సోషల్ ఇంజినీర్ అని పార్టీ నేతలు ఫీలవుతున్నారు.
హిందూపురం పార్లమెంట్ ఎక్కువ మంది ఉన్న సామాజికవర్గానికి అనంతపురం పార్లమెంట్ లో .. అనంతపురం పార్లమెంట్ లో అత్యధిక మంది ఉన్న ఓటర్లు ఉన్న సామాజికవర్గానికి హిందూపురం పార్లమెంట్ సీటు కేటాయించారు. ఈ పేర్లు చూసి జగన్ రెడ్డికి ఎక్కడ ఎంత మంది ఓటర్లు ఉన్నారో కూడా తెలియదా.. తెలిసినా తానేం చే్స్తే అదే రాజకీయం అనుకుంటున్నారా అన్నది అర్థం కాలేదు. అనంతపురం ఓ కేస్ స్టడీ మాత్రమే.. ఇంచార్జుల్ని మార్చిన యాభై నియోజకవర్గాల్లో ఒక్కరికీ ఆ నియోజకవర్గంలో సమీకరణాలు కలసి వస్తాయని చెప్పే పరిస్థితి లేదు. ఉన్న వాళ్లే బెటర్ అని .. ఏ రకంగా చూసినా కొత్త సమన్వయకర్తలు తేలిపోతారని నిష్ఠూరమాడుతున్నారు. ఈగో సమస్యలతోనే అత్యధిక మంది దూరం వల్లభనేని బాలశౌలి, సంజవ్ కుమార్, లావు కృష్ణదేవరాయులు, జంగా కృష్ణమూర్తి.. ఇలా కనీసం పాతిక మంది లీడర్లు జగన్ రెడ్డికి దూరమవడానికి వారిపై ఉన్న వ్యతిరేకత లేకపోతే.. మరో కారణమో కాదు.. కేవలం ఈగోనని వైసీపీలో అందిరకీ తెలిసిన విషయం.
లావు కృష్ణదేవరాయులు కుక్కిన పేనులా పడి ఉండలేదని.. ఆయనపై పగ పెంచుకున్నారు. ఆయనకు టిక్కెట్ లేదని చెప్పి వేరే వారి పేర్లు ప్రచారంలోకి తెచ్చారు. ఆయన అయితేనే గెలుస్తామని ఎమ్మెల్యే అభ్యర్థులు నెత్తినోరూ బాదుకున్నా జగన్ రెడ్డి వినిపించుకోలేదు. ఇప్పుడు చిల్లర దందాలు చేసుకునే నాగార్జున యాదవ్ కు టిక్కెట్ ఇస్తున్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇచ్చిన పార్టీకి వెళ్లారని బాలశౌరిని దూరం పెట్టారు. ఇప్పటికి నాలుగు.. ఇంకా ఎన్ని జాబితాలో ! ఇప్పటికి నాలుగు జాబితాలు రిలీజ్ చేశారు. ఐదో జాబితా పేరుతో చాలా మందిని క్యాంప్ ఆఫీస్ కు పిలిపించుకుంటున్నారు. రాను రాన ఈ కసరత్తుపై వైసీపీ ఎమ్మెల్యేల్లోనే అనాసక్తి ప్రారంభమయింది. టిక్కెట్ కోసం పోటీ పడాల్సిన పనే లేదని ఇస్తే సరే ..లేకపోతే లేదనుకున్నట్లుగా ఉంటున్నారు.
సొంత బలం ఉన్న నేతలు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు ప్రతిపక్షాలను ఇష్టం వచ్చినట్లుగా తిట్టి.. తమకు ఎక్కడా చోటు లేకుండా చేసుకున్న వారు మాత్రం జగన్ రెడ్డి దేవుడంటూ చెప్పుకుని.. కనీసం ఎక్కడో చోట అయినా చాన్సిచ్చేలా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అత్యధిక మంది నేతలు మాత్రం జగన్ రెడ్డి టిక్కెట్ల కసరత్తు చూసి పిచ్చెక్కిపోతున్నారు.