కడప జిల్లా వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలంతా ఇప్పుడు రష్యాలో చిల్ అవుతున్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా దగ్గర్నుంచి కనీసం ఓ ఇరవై మంది కీలక నేతలు రష్యాలో ఉన్నారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వైసీపీ నేతల ఇలా పార్టీ కోసం అందర్నీ రష్యా తీసుకెళ్లారని చెబుతున్నారు. అయితే అది పార్టీనా లేకపోతే చీకోటి ప్రవీణ్ కేసినో తరహాలో ఏదైనా ఏర్పాటు చేశారా అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ వైసీపీ నేతల రష్యా టూర్ మాత్రం కడప జిల్లాలో చర్చనీయాంశమవుతోంది.
ఇలా వైసీపీ నేతలు చిల్ అవడానికి రష్యాకు వెళ్లడం ఇదే ప్రథమం కాదు. గతంలో మంత్రి హోదాలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక విమానంలో రష్యా వెళ్లారు. ఓ వ్యాపారవేత్త తన పుట్టిన రోజు వేడుకలను రష్యాలో నిర్వహించారని ఆయనే అందరికీ ఖర్చు భరించి మరీ తీసుకెళ్లి పార్టీ ఇచ్చాడని చెప్పుకున్నారు. ఆయనెవరు..ఎవరెవరు వెళ్లారు అన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇప్పుడు కడప జిల్లా నేతలు రష్యాలో పండగ చేసుకోవడానికి వెళ్లారు.
రష్యాకే ఎందుకు వెళ్తున్నారనేది కొంత మందికి వస్తున్న డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా రష్యా ఇబ్బందుల్లో ఉంది. అటు వైపు వెళ్లకపోవడం మంచిదని ట్రావెల్ అడ్వయిజరీలు కూడా ఉన్నాయి. కానీ వైసీపీ నేతలు ఎంపిక చేసుకుని మరీ రష్యాకు పోతున్నారు. అక్కడైతే కావాల్సినంత ప్రైవసీ ఉంటుందని అనుకుంటున్నారేమో కానీ… చిల్ అయ్యే అవిషయంలో వైసీపీ నేతలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.