వైసిపి లో దుబారా మాటలు, బూతులు నాతో సహా అందరూ మాట్లాడడం వల్లనే మాకు జనాలు 11 ఇచ్చారు అని జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బహిరంగంగా చెబుతున్నారు. వంశీ, కొడాలి నాని వంటి వాళ్లను పార్టీ నుంచి పంపేస్తే సగం దరిద్రం పోతుందని వాసుపల్లి గణేష్, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వంటి వారు తరచూ చెబుతూంటారు. బయటకు చెప్పకపోయినా సీక్రెట్ గా అభిప్రాయసేకరణ చేస్తే కనీసం సగం మంది వైసీపీ నేతలు క్యాడర్..ఈ బూతులు మాట్లాడే నేతల్ని బయటకు పంపేయాలని వారికి ఎలాంటి సపోర్టు చేయవద్దన్న ఫీడ్ బ్యాక్ వస్తుంది.
కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతల అభిప్రాయాలను కూడా వినే పరిస్థితుల్లో లేరు. ప్రజల్లో ఘోరమైన ఇమేజ్ ఉండి.. దోపిడీలు, దొంగతనాలు, బూతులను ప్రోత్సహించే వారిగా పేరున్న వారికి సపోర్టు చేయడం అంటే ప్రజల్ని తక్కువ చేయడమేనని అలాంటి పనులు వద్దని కోరుకుంటున్నారు. అయితే జగన్ మాత్రం తన మైండ్ సెట్ కు దగ్గరగా ఉన్నవారిని.. భవిష్యత్ లో మనోరంజకంగా తన కోసం తిట్లందుకునేవారిని వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లుగా ఉన్నారు. అందుకే మద్దతిస్తున్నారు.
వైసీపీ క్యాడర్ ఇంకా నిర్వేదం కలిగించే విషయం ఏమిటంటే స్వయంగా జగన్ కూడా అదే భాష మాట్లాడుతూండటం. కొడాలి నాని, అవినాష్ అంద చందాల గురించి మాట్లాడటం..కుల,, మతాల ప్రస్తావన నేరుగా తేవడం సీఎం స్థాయిలో పని చేసిన వారు చేయాల్సిన పనులు కాదన్న అభిప్రాయం ఉంది. ప్రజల్లో కాస్తంత ఇమేజ్ నిలబెట్టుకోవాలన్న ఆలోచన చేయాలన్న సూచనలు చేస్తున్నారు. కానీ వీటిని జగన్ రెడ్డి అండ్ కోటరీ పట్టించుకోవడంలేదు. ప్రజలు అన్నీ త్వరగా మర్చిపోతారని తాము అనుకున్నది చేయాలని అనుకుంటున్నారు.