అనర్హతా వేటు పడకుండా అసెంబ్లీలో హాజరు వేయించుకున్న జగన్ సహా ఎమ్మెల్యేలు పదకొండు నిమిషాల్లో అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన కాసేపటి వరకూ చూశారు. తర్వాత జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. పట్టించుకునే పరిస్థితి లేదనో.. తమకు గొంతు నొప్పి ఎందుకనుకున్నారో కానీ.. పదో నిమిషంలో అందరూ బయటకు వెళ్లిపోయారు. జగన్ కూడా వారితో పాటు వెళ్లిపోయారు.మొత్తంగా అసెంబ్లీలో పదకొండు నిమిషాల పాటు గడిపారు.
ఉభయసభల సమావేశం కావడంతో బొత్స , జగన్ పక్క పక్కనే కూర్చున్నారు. శాసనమండలిలో బొత్సకు ప్రతిపక్ష నేత హోదా ఉంది. జగన్ కు లేదు. అందుకే బొత్స మిగతా ఎమ్మెల్యేలతో పాటు ముందుకు వెళ్లి నినాదాలు చేయలేదు. అయితే అందరితో పాటు బయటకు వెళ్లిపోయారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని తాము వాకౌట్ చేస్తున్నట్లుగా ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు.
వైసీపీ వ్యవహారం చూసి జనం కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. ఏదైనా ప్రజాసమస్య కోసం ఇలా చేసినా కాస్తంత గౌరవం ఉండేదమో కానీ..లేని.. ప్రజలు ఇవ్వని గౌరవం కోసం జగన్ ఇలా మిగతా వారిని ఉపయోగించుకోవడం ఆశ్చర్యకరంగా మారింది. అనర్హతా వేటు భయంతోనే అందరూ అసెంబ్లీకి వచ్చారని..మరో అరవై రోజులు అసెంబ్లీ పని దినాల వరకూ కనిపించరని.. టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్
గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోయిన వైసీపీ సభ్యులు. pic.twitter.com/nt2Xrh5bTp
— Telugu360 (@Telugu360) February 24, 2025