వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. జగన్ రెడ్డి నుంచి కింది స్థాయి నేతల వరకూ దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. నిజానికి ఇప్పటి వరకూ పెద్దగా ఎక్కడా దాడులు జరగలేదు. వల్లభనేని వంశీ అనుచరులు రెచ్చగొట్టడంతో కాస్త ఆయన ఇంటి వద్ద కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. అంతకు మించి ఏమీ లేదు. కానీ మమ్మల్ని కొట్టేస్తున్నారని రచ్చ చేస్తున్నారు.
ఓ సునీల్ వెంకటేష్ కొట్టకుండానే ఏడ్చినట్లు… కొడతారనే భయంతో ఏడుస్తున్నట్లుగా వైసీపీ నేతల తీరు ఉంది. వారు చేసిన వ్యవహారాలకు అసలైన ట్రీట్ మెంట్ కోసం టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నారు. అందులో సందేహమే లేదు. ఇంకా టీడీపీ చేతికి అధికారం అధికారికంగా అందలేదు. కేర్ టేకర్ సీఎంగా జగనే ఉన్నారు. రాష్ట్రంలో కౌంటింగ్ అనంతర హింస జరగకుండా సీఆర్పీఎఫ్ బలగాలు ఉన్నాయి. అవి మరో రెండు వారాలుంటాయి.
ఇప్పటికే జగన్ ను చూసుకుని రెచ్చిపోయిన కొంత మంది నేతలు ఇప్పటికే రాష్ట్రాలు దాటిపోయారు. టీడీపీని రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతో కొంత మంది ఉన్నారేమో కానీ.. ఇంకా అసలు కొట్టుడు స్టార్ట్ కాలేదని.. అప్పుడే ఏడిస్తే తర్వాత ఎవరూ పట్టించుకోరని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.