అధికారం ఉంది కదా అని టీడీపీ నేతల్ని పోలీసుల్ని పెట్టి ఎలా హింసించాలో అలా హింసించి లైవ్ లో చూసి ఆనందపడిపోయారు జగన్ రెడ్డి. అదంతా ఆయన మానసిక ఆనందం కోసం. ఆయనను సంతృప్తి పరిస్తేనే పదువులు వస్తాయి కాబట్టి నేతలూ.. అధికారులూ రెచ్చిపోయారు. మధ్యలో వైసీపీ నేతలు మాత్రం టెన్షన్ పడుతూనే ఉన్నారు. రేపు అధికారం పోతే జగన్ రెడ్డి బాగానే ఉంటాడు.. మన పరిస్థితేమిటని. అసలు మనం ఓడిపోనే పోమని .. ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా గెలిచే మార్గాలున్నాయని.. జగన్ అందర్నీ నమ్మించారు. దానికి స్థానిక ఎన్నికలను సాక్ష్యంగా చూపించారు. కానీ అసలు స్క్రిప్ట్ వేరుగా ఉందని ఇప్పుడు అర్థమయింది.
Read Also : చెవిరెడ్డి కొడుకు అరెస్ట్
తెలుగుదేశం పార్టీ నేతలపై జరిగిన వేధింపులను ఎవరూ మర్చిపోయే అవకాశం లేదు. కానీ అది చిన్న విషయం కాదు. ఇప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే అధికారం వచ్చినా ఏమీ చేయలేదని చేతకాని వాళ్లంటారు. అలాగాని చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయలేరు. చట్టపరంగానే చేయాలనుకున్నది చేస్తారు. ఇప్పుడు అదే జరగబోతోంది. ఏం జరుగుతుందో వైసీపీ కింది స్థాయి నేతలకు బాగా తెలుసు. అందుకే చాలా మంది సైలెంట్ అయిపోయారు. అంత మాత్రాన వారిని వదిలేస్తారా అంటే… అది జరిగే పని కాదని .. టీడీపీ వర్గాలంటున్నాయి. ఎందుకంటే వారు పడిన ఇబ్బందులు అలాంటివి. వారి క్యాడర్ పడిన మానసిక వేదన అలాంటిది.
ఉదాహరణకు ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్రపై ఓ హత్య కేసును బనాయించిన విధానం తెలిసిన ఎవరికైనా కడుపు మండిపోతుంది. ఆయన ఐదేళ్లు మంత్రిగా ఉన్నా ఒక్క వైసీపీ నేతపై కేసులు పెట్టలేదు. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే .. ఓ హత్య కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి.. స్వయంగా పోలీసులే కొల్లు రవీంద్రకు ఫోన్ చేయించి.. ఆ కాల్ ఆధారంగా చూపించి అరెస్టు చేశారు. మళ్లీ దానికి తప్పుడు ప్రచారాలు. అలాంటి కుట్రలకు పాల్పడినవారిని వదలాలని ఎవరైనా అనుకుంటారా ?. నిజానికి ఈ అరెస్టు చేయించాలని ఆయన ప్రత్యర్థి పేర్ని నానీకి ఉండకపోవచ్చు. అది జగన్ రెడ్డి మానసిక ఆనందం కోసం చేసిన కుట్ర. దానికి ఇప్పుడు ప్రతిఫలం అనుభవించాల్సింది మాత్రం పేర్ని నానిలే కదా. జగన్ కోసం.. కింది స్థాయి నేతలు ఎలా సఫర్ అవ్వబోతున్నారో ముందు ముందు ఇంకా చాలా ఉండబోతున్నాయి.
Read Also : వైసీపీ నేతలకు నొప్పి తెలుస్తుందా ?
టీడీపీ కార్యకర్తలు… ప్రతి ఒక్కదాన్న ిగుర్తు పెట్టుకున్నారు. ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. మెల్లగా వన్ బై వన్ పూర్తి చేసుకుంటూ వస్తారని వారు నమ్ముతున్నారు.