తుని మున్సిపాలిటీలో వైసీపీ చేతులెత్తేసింది. కౌన్సిలర్లలో 12 మంది తప్ప అందరూ టీడీపీలో చేరిపోవడంతో ఇక కష్టం అని చెప్పి మున్సిపల్ చైర్మన్ కూడా రాజీనామా చేశారు. ఇప్పటికే మూడు సార్లు వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేని కారణంగా వాయిదా పడింది.
తుని మున్సిపాలిటీలో ప్రభుత్వం మారిన తర్వాత కౌన్సిలర్లు టీడీపీ వైపునకు చేరారు. వైస్ చైర్మన్ స్థానం ఖాళీ కావడంతో మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆ చైర్మన్ స్థానాన్ని తమ పార్టీకే దక్కించుకునేందుకు ప్రయత్నించారు. కౌన్సిలర్లు పార్టీ మారినవారు పోగా.. మిగిలిన వారు పోకుండా నిర్బంధించారు. వారిని సమావేశాలకు వెళ్లకుండా చేశారు. అదే సమయంలో ఎన్నిక జరిగినప్పుడల్లా ఉద్రిక్తతలు సృష్టించారు. ఈ కారణంగా మూడుసార్లు ఎన్నిక వాయిదా పడింది.
ఈ సారి వైస్ చైర్మన్ ఎన్నికకు షెడ్యూల్ వస్తే.. వచ్చిన కౌన్సిలర్లలోనే మెజార్టీని చూసి వైస్ చైర్మన్ ను ఎన్నుకుంటారు. దాంతో ఇక కౌన్సిలర్లను నిర్బంధించి ప్రయోజనం లేదనుకున్నారు. దాడిశెట్టి రాజా వదిలేయడంతో వారంతా వెళ్లి టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు టీడీపీకి అక్కడ 20కిపైగా కౌన్సిలర్లు బలం ఉంది. వైసీపీకి 12 మంది వరకూ మద్దతుగా ఉన్నారు. చైర్ పర్సన్ కూడా రాజీనామా చేయడంతో .. కలెక్టర్ తీసుకునే నిర్ణయంపై ఎన్నిక జరగనుంది. మొత్తంగా సింపుల్ గా చేయాల్సిన పనిని పెద్దది చేసుకున్నా.. యనమల పరిస్థితిని చక్కదిద్దుకున్నారు.