సినిమా ఇండస్ట్రీ నుంచి ఏపీ ప్రభుత్వం అలీకి సలహాదారుగా పదవి ఇచ్చినప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా కంగ్రాట్యూలేట్ చేస్తూ కనీసం ట్వీట్ చేయలేదు. పోసానికి కూడా అంతే. అంటే.. వీరు చాలా చిన్న పదవుల కోసం.. ఎంత మందిని దూరం చేసుకున్నారో ఎంత దారుణమైన రాజకీయాలు చేశారో అర్థం చేసుకోవచ్చు. అలా చేసి… కూడా ఏ పదవులు పొందని వారు ఉన్నారు. పదవులు పొంది వైసీపీ మార్క్ రాజకీయాల్లో బలైపోయిన ఫృధ్వీ లాంటివాళ్లూ ఉన్నారు. అయితే దాదాపుగా నాలుగేళ్ల తర్వాత ఏడాది చాన్స్ ఉన్న పదవి ఇవ్వడం దేనికి సంకేతం ? ఇంత కాలం గుర్తుకు రాని వారు ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చారు ?
మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలా లేకపోయినా… మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగాల్సిఉంది. తెలంగాణతో పాటు ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారన్న నమ్మకం ఇప్పటికే ఉంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవడం మంచిది కాదన్న వాదన ఉంది.ఇప్పుడు ప్రచారం కోసం సినిమా ఇండస్ట్రీ నుంచి ఓ బ్యాచ్ కావాలి. గతంలోలా … ఊరూవాడా తిరిగి.. ప్రచారం చేయడానికి కావాలి . ఇప్పుడు వీళ్లకు పదవులు ఇవ్వడం వల్ల.. కొంత మంది ఆశతో వైసీపీకి పని చేయడానికి వస్తారన్న ప్లాన్‌తోనే వీరికి పదవులు ప్రకటిస్తున్నారని అంచనా వేస్తున్నారు.
గతంలో వైఎస్ఆర్సీపీ కోసం యాక్టివ్‌గా పని చేసి ఇప్పటికీ ఏ పదవి పొందలేకపోయిన వారిలో ఇంకా మోహన్ బాబు మిగిలి ఉన్నారు. కానీ ఆయన ఇటీవలి కాలంలో ఆ పార్టీలో ఉన్నారో లేరో అన్నట్లుగా ప్రకటనలు చేస్తూండటంతో ఏ పదవి ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు. ఆయన కూడా ప్రస్తుత పరిస్థితిని చూసి దూరంగా ఉన్నారు. అయితే ఫేడవుట్ అయిన కొంత మందిని పార్టీలో చేర్పించుకుని యాక్టివ్ చేసే ఉద్దేశంలో ఉన్నారన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. వారెవరు అన్నది మాత్రం క్లారిటీ లేదు.కానీ ఎవరైనా… పోసాని లేదా ఫృధ్వీలా బూతులు మాట్లాడి… వ్యక్తిగత శత్రువుల్ని పెంచుకుంటారా అన్నది మాత్రం సందేహమే.