మెంటల్ కృష్ణ అనే సినిమాలో హీరో పాత్ర వేసిన కృష్ణమురళి..తన టాలెంట్ ను గుర్తు చేసుకుని జైల్లో అదే ప్రతిభా ప్రదర్శన చేశారు. జైలు కాకుండా ఆస్పత్రిలోఉండేలా ప్లాన్ చెబుతా అని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వచ్చి ఐడియా ఇచ్చిపోయే సరికి కడుపు నొప్పి, గుండెనొప్పి ఒకే సారి వచ్చాయి. పోలీసులు తీసుకెళ్లి టెస్టులు చేయిస్తే డ్రామాలన్నీ బయటపడ్డాయి. దీని వల్ల ఎవరి పరువు పోయింది. పోవడానికి ప్రత్యేకంగా ఏముందిలే అనుకుంటే ఏం చేయలేరు కానీ.. ఇప్పటికే కూరుకుపోయిన ఊబిలో మరింతగా కూరుకుపోతారు.
వైసీపీని నమ్ముకుని జగన్ రెడ్డి చెప్పినట్లుగా చేసి పోసాని బావుకున్నది ఎంత ఉన్నది ఆయనకే తెలియాలి. పైకి కనిపించేది మాత్రం చివరి రోజుల్లో వచ్చిన ఓ చిన్న పదవి. ఆ పదవితో వచ్చిన మూడు లక్షల జీతం. కానీ ఆయన ఏం కోల్పోయారని చూస్తే.. మొత్తం మనశ్శాంతిని కోల్పోయారు. ఇంకా చెప్పాలంటే కుటుంబానికి నిద్ర లేకుండా చేస్తున్నారు. అసలు ఎందుకు జగన్ కోసం ..ఇతర నేతల్ని .. వారి కుటుంబసభ్యులను..తిట్టాలి ?. రాజకీయ నేత అయితే మామూలుగా అందరూ చేసే విమర్శలు చేయలేరా ?. పోనీ ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారా అంటే. .. అదే వైసీపీ నేతల మాటలు నమ్మి మరింతగా ఊబిలోకి వెళ్లిపోతున్నారు.
పోసాని కృష్ణమురళి లాంటివాళ్లే కాదు.. జగన్ మాటల్ని నమ్మి .. వైసీపీని నమ్ముకుని నిండా మునిగిపోయిన వారందరూ ఇప్పటికైనా వైసీపీ ట్రాప్ నుంచి బయటకు వచ్చి తాము ఎలా బయటపడాలో ఆలోచించుకోవాలి. ఎందుకంటే వైసీపీ మార్క్ రాజకీయం అత్యంత ఘోరంగా ఉంటుంది. పోసానికి నిజంగా గుండెపోటు వస్తే బాగుండు.. జరగరానిది ఏదైనా జరిగిదే బాగుండు.. రచ్చ రచ్చ చేయవచ్చని అనుకునే మైండ్ సెట్ వారిది. ఒక్క పోసాని రాజకీయంగా ఉపయోగపడుతుందని అనుకుంటే అంత కంటే ఘోరంగా వ్యవరిస్తారు. ఈ విషయాలు గుర్తు పెట్టుకుని ఆయినా వైసీపీ దెబ్బకు కుదలైన నేతలు.. వారి ట్రాప్ నుంచి బయటపడేలా ఆలోచించుకోవాలి. లేకపోతే సర్వం కోల్పోయాక..చివరికి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టుకున్నాక చేతులు పిసుక్కుని ప్రయోజనం ఉండదు.