వైసీపీ మీడియా, సోషల్ మీడియా ఎంత భావదారిద్ర్యంలో ఉందో … నాదెండ్ల మనోహర్ కు చంద్రబాబు క్లాస్ అంటూ చేస్తున్న ప్రచారంతోనే తేలిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరద సహాయ చర్యలు జోరుగా సాగుతున్నాయి. నిద్రాహరాలు మానేసి.. సీఎం దగ్గర నుంచి అందరూ కష్టపడుతున్నారు. అలాంటి సమయంలో … సూచనలు ఇచ్చి పుచ్చుకోవడం.. తప్పుల్లేకుండా చేసుకోవడం .. సమర్థవంతులు చేసే పని. అక్కడకూడా అదే జరిగింది.
ఇంటింటింకి నిత్యావసరాలు పంచాలనుకున్నప్పుడు… పౌరసరఫరాల మంత్రిగా నాదెండ్ల మనోహర్ యాక్టివ్ పార్ట్ తీసుకోవడం సహజం. చంద్రబాబు ఆయనకు కొన్ని సూచనలు చేశారు. ఆ వీడియోను ఎక్కడో కిలోమీటర్ దూరం నుంచి తీసి జూమ్ చేసి… చంద్రబాబు ఏదో నాదెండ్ల మనోహర్ వార్నింగ్ ఇచ్చేశారన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. తప్పుడు వ్యాఖ్యలతో మీమ్స్ చేసుకుని సంతృప్తి పడుతున్నారు.
నాదెండ్లమనోహర్ పని తీరు గురించి అందరికీ తెలుసు. ఆయన ఎంత కష్టపడుతున్నారో గత మూడు నెలల్లోనే స్పష్టమవుతుంది . ఆయన నుంచి చంద్రబాబు మంచి పనితీరు ఎక్స్ పెక్ట్ చేస్తారు సీఎం వేగాన్ని అందుకునేందుకు నాదెండ్ల పని చేస్తారు. ఈ క్రమంలో సూచనలు చేస్తే.. అది కూడా తప్పని ప్రచారం చేసుకునేవారికి … రాజకీయంగా భావదారిద్ర్యం తప్ప.. మరో లక్షణం ఉండే అవకాశం లేదని కూటమి వర్గీయులు సెటైర్లు వేస్తున్నారు. అయినా.. ఇలాంటివి చేసుకుని స్వయం సంతృప్తి పటడం వైసీపీ నైజం. వాటిని నమ్ముకుని ఎక్కడికి దిగజారిపోయామన్నది కూడా ఇంకాగుర్తించలేకపోతున్నారు మరి !