కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటోంది. ఓ వైపు కేంద్రం… ఆక్సిజన్, వ్యాక్సిన్లు, రెమిడిసివర్ ఇంజక్షన్లు అన్నింటినీ అధీనంలోకి తీసుకుని అరకొరగా పంపుతోంది. దీంత ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిమితులతో సెకండ్ వేవ్ ఎదుర్కోవడానికి కష్టపడాల్సి వస్తోంది. ప్రజల కష్టాల్లో ఉంటే వారిని రెచ్చగొట్టాడనికి టీడీపీ నేతలు మరింతగా ప్రయత్నిస్తున్నారని అనుమానిస్తున్న వైసీపీ నేతలు.. టీడీపీ నేతల్ని కట్టడి చేయడానికి భిన్నమైన వ్యూహం ఎంచుకున్నారు. అదే చంద్రబాబు, లోకేష్‌పై కేసులు పెట్టటం. రెండు రోజులుగా… వైరస్ వ్యవహారాలపై మాట్లాడితే.. కఠినంగా వ్యవహరిస్తామని అణిచి వేస్తామని మంత్రులు చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా కేసులు ప్రారంభించారు.
మీడియాలో.. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం జోరుగా సాగుతోందని భావిస్తున్న ఏపీ సర్కార్… ఇప్పుడు కట్టడి చేయాలంటే.. ఆ మీడయాకు అంతకు మించిన వార్తలు కావాలని డిసైడ్ అయ్యారు. చంద్రబాబు, లోకష్లకు నోటీసులు ఇవ్వడం.. అరెస్ట్ చేస్తామన్నంత హడావుడి చేయడం… ఆ మీడియాకు ఎక్కడ లేని వార్త అవుతుందని.. ఆ దిశగా ముందుకు వెళ్తే… అనుకున్న పని అనుకున్నట్లుగా అయిపోతుందని అంచనాకు వచ్చారు. ఆ ప్రకారమే… చంద్రబాబుపై కేసు పెట్టారని చెబుతున్నారు. ఇప్పుడు నోటీసుల పేరుతో హడావుడి చేస్తారు. తర్వాత అరెస్ట్ పేరుతో మరికొంత హడావుడి చేస్తారు. ఇలా చేయడం వల్ల కరోనా సమస్యల నుంచి మీడియా అటెన్షన్ పోతుందని కొంత మంది విశ్లేషిస్తున్నారు.
జార్ఖండ్ సీఎంను విమర్శిస్తూ ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేసిన కాసేపటికే.. చంద్రబాబుపై కేసు పెట్టిన వార్త వెలుగులోకి వచ్చింది. కడపలో పేలుళ్లు జరిగిన కాసేపటికే.. లోకేష్‌పై కేసు పెట్టారంటూ మీడియాకుసమాచారం ఇచ్చారు. ఇక వారికి నోటీసులు ఇతర వ్యవహారాలతో కాస్త హంగామా చేస్తారు. దీని వల్ల మీడియాలో జరుగుతున్న నెగెటివ్ ప్రచారం… రాజకీయం వైపు వెళ్తుందని వైసీపీ పెద్దలు ఓ పక్కా ప్రణాలిక ప్రకారం ఉన్నారని అంటున్నారు. రాజకీయ కక్షలు సాధిస్తున్నారని.. అదంతా రాజకీయం అని ప్రజలుఅనుకుంటారని.. తమకు వ్యతిరేకత ఏమీ ఉండదనే అంచనాకు వస్తున్నారు. అదే సమయంలో… కరోనా కష్టాలకు ప్రభుత్వం కారణం అన్న వాదనను.. ప్రజల్లోకి తీసుకెళ్లకుండా..ప్రతి పక్షాలకు అడ్డు పడినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి వైసీపీ నేతల వ్యూహంలో మీడియా పడుతుందా లేదా.. ముందు ముందు జరిగే పరిణామాలను బట్టి డిక్లేర్ చేసుకోవచ్చు.