గనుుల శాఖలో ఐదేళ్ల పాటు జరిగిన విచ్చలవిడి దోపిడికి పావుగా ఉపయోగపడిన వెంకటరెడ్డిని హైదరాబాద్ లో పోలీసులు పట్టుకున్నారు. కోస్ట్ గార్డ్ అధికారి అయిన ఆయన మూడు నెలలుగా పరారీలో ఉన్నారు. ఓ వైసీపీ నేతకు బంధువు అయిన వెంకటరెడ్డి హాయిగా కోస్టుగార్డులో ఉద్యోగం చేసుకుని గౌరవం పొందకుండా… మన ప్రభుత్వం అంటూ వచ్చేశారు. ఆలా వచ్చిన వాళ్లను ఎలా బలి పశువుల్ని చేసి… దోచుకోవాలని జగన్ రెడ్డి గ్యాంగ్ కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు.
వెంకటరెడ్డిని ముందు పెట్టి ఇసుక సహా ప్రతి ఖనిజంలోనూ మేత ప్రారంభించారు. నింద మాత్రం ఇప్పుడు వెంకటరెడ్డిపై పడింది. ఆయనలో ఎంత మేర మన అనే భావనను నెలకొల్పారంటే.. ఆయన గనుల శాఖలో దోపిడీపై వస్తున్న ఆరోపణల్ని మీడియా ముందుకు వచ్చి ఖండించేటప్పుడు మన ప్రభుత్వం వచ్చాక.. అనే వారు. ఆయన మంత్రి అయితే తప్పు లేదు..కానీ ఆయన అధికరి. అయినా మన ప్రభుత్వం అనేవారు. అలాంటి కులం మత్తు నిండా ఉన్న అధికారిని పూర్తిగా వాడుకున్నారు.
వేల కోట్లు దోచుకుని వెంకటరెడ్డిపై తోసేశారు. ఇప్పుడు ఆయన చిక్కారు. ఆయన తనను అడ్డం పెట్టుకుని వేల కోట్లు దోచేసిన వాళ్ల పేర్లు చెబుతారా.. లేకపోతే తానొక్కడే దోచుకున్నాడని మొత్తం మీద వేసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. ఏదైనా జగన్ రెడ్డిని నమ్ముకుని గౌరవంగా బతకాల్సిన మరో రెడ్డి ఆఫీసర్ జైలుకెళ్తున్నారు.