వైసీపీ మంత్రులకు మా చెడ్డ చిరాకు వచ్చేస్తోంది. ముఖ్యంగా పవన్, లోకేష్ యాత్రలపై రెస్పాండ్ అవమని తాడేపల్లి నుంచి వచ్చే ఆదేశాలను అందుకునేవారికి మరీ చిరాకొస్తోంది. వారికొచ్చే స్క్రిప్ట్ ఒక్కటే.. అందులో పేర్లే మారుతున్నాయి. గొంతు చించుకుని వారాహి యాత్ర ఫ్లాపు.. లోకేష్ పాదయాత్ర ఫ్లాపు.. ఆయన పప్పు…. ఈయన అసమర్థుడు అని చెప్పాల్సి వస్తోంది కానీ.. వారు చేసే విధానపరమైన విమర్శలకు లాజికల్ గా సమాధానం చెప్పే అవకాశం ఉండదు.. తాము ట్రోలింగ్ కు గురికావాల్సి వస్తోందని ఆ మంత్రులు నసుగుతున్నా ప్రయోజనం ఉండదు.. నోరు నొప్పెట్టాలా ప్రచారం చేయడమే వారి పని.
లోకేష్ పాదయాత్ర నెల్లూరులోకి ఇలా అడుగు పెట్టీ పెట్టగానే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. లోకేష్ పాదయాత్ర ఫ్లాప్ అన్నారు. అదేంటన్నా ఇంకా నెల్లూరు జిల్లాలో ప్రారంభం కాక ముందే ఫ్లాప్ అంటున్నారు అని ఇతరులకు డౌట్ వస్తుందని కూడా అనుకోలేదు. ఇష్టం లేని హీరో సినిమాపై ఇతర హీరోల దురభిమానులు ఫ్లాప్ ప్రచారం తొందరపడి ప్రచారం చేసినట్లుగా ప్రచారం ప్రారంభించేస్తారు. కానీ వాస్తవంగా లోకేష్ పాదయాత్ర దెబ్బకు వైసీపీ నేతలంతా రోజూ సమావేశం పెట్టుకుని ఎలా కౌంటర్ ఇవ్వాలా అని కిందామీదా పడుతున్నారు. కానీ మిగిలి ఉన్న వైసీపీ నేతల్లో అంతా ఎవరి లెక్కల్లో వారికు ఉన్నాయి కానీ ఎవరూ స్పందించడంలేదు.
ఇక పవన్ వారాహి యాత్ర ఫ్లాప్ అని చెప్పడానికి… ఆయన కాపుల్ని ఎకం చేస్తున్నారని.. ఎలాగైనా నిలువరించడానికి చేసిన ప్రయత్నాల గురించి చెప్పాల్సిన పని లేదు. చివరికి కొట్టు సత్యనారాయణ కూడా రంగంలోకి దిగి పవన్ యాత్ర ఫ్లాప్ అని లబలబ కొట్టుకున్నారు. ఇలా విపక్ష నేతలంతా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూంటే… వారికి వెల్లువలా ప్రజా మద్దతు లభిస్తోంది. కానీ గడప దాటని వైసీపీ నేతలు… మాత్రం ఏసీ రూముల్లో కూర్చుని ఫ్లాప్ .. ఫ్లాప్ అని అరుస్తున్నారు.