రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే ముఖ్యమంత్రి ఉన్నారన్నట్లుగా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలు… దారుణమైన ప్రకటనలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ.. తెలంగాణతో కలిసిపోవడానికి రెడీగా ఉన్నారని.. అదే కోరుకుంటున్నారంటూ… హైదరాబాద్ కు వెళ్లి.. తెలంగాణ అసెంబ్లీకి వెళ్లి.. అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో వెటకారంగా మాట్లాడుతున్నారు.. వైసీపీ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే కాటసారి రాంభూపాల్ రెడ్డి… తెలంగాణలో తనకు ఉన్న వ్యాపార వ్యవహారాల్లో సాయం కోసం.. మాట్లాడేందుకు… కేటీఆర్ కోసం.. తెలంగాణ అసెంబ్లీకి వెళ్లారు. మామూలుగా అయితే కేటీఆర్ అపాయింట్ మెంట్ అంత సామాన్యంగా దొరకదు. అందుకే.. ఆయన అసెంబ్లీకి వెళ్లారు. కేటీఆర్ ను కలిసి తన వ్యక్తిగత వ్యాపార వ్యవహారాల గురించి మాట్లాడుకున్నారు. తర్వాత మీడియాతో పిచ్చాపాటి మాట్లాడుతూ… చేయాల్సిన వ్యాఖ్యలన్నీ చేశారు.
పక్కన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా… సొంత రాష్ట్రాన్ని కించపరిచారు. బలవంతంగా గెంటేసినా.. ఇప్పటికీ ప్రజలు… తెలంగాణతో కలిసి ఉండటానికే సిద్ధమన్నట్లుగా చెప్పుకొచ్చారు. అంతే.. గోదావరి, కృష్ణా నదులపై… ఉమ్మడి… రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టు కడితేనే.. రాయలసీమకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ చెప్పినట్లుగా… జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంపైనా.. రాంభూపాల్ రెడ్డి.. విభిన్నంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి .. .తన తండ్రి వైఎస్ పాలనను చూసి కాపీ కొట్టి.. ఆ విధంగా పాలిస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఎన్నికల్లో.. టీఆర్ఎస్ … వైసీపీకి బహిరంగ మద్దతు తెలిపింది. ఎన్నికల్లో విజయం తర్వాత వైసీపీ నేతలంతా.. టీఆర్ఎస్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా.. కేసీఆర్ ఆదేశాలను పాటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపునకు జగన్ అంగీకరించారని స్వయంగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అమరావతి ఎందుకు ఆగిపోయిందో.. కూడా.. కేసీఆర్ పరోక్షంగా అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. అది డెడ్ ఇన్వెస్ట్ మెంట్ అని తాను అప్పట్లోనే చంద్రబాబుకు చెప్పానన్నారు. ఈ క్రమంలో.. వైసీపీ నేతలు.. మరింత అడ్వాన్స్ అయిపోయే.. ఏపీ ప్రజలు.. తెలంగాణతో కలవడానికి సిద్ధంగా ఉన్నారన్నట్లుగా ప్రకటనలు చేయడం.. వైసీపీ, టీఆర్ఎస్ బంధంలో కీలకాంశం.