ఓ స్థలం ఉంది. దాన్ని కబ్జా చేయాలనుకున్నాడు… ఓ రాజకీయ నాయకుడు. ఇరవై ఏళ్ల కిందట కొనుగోలు చేసినట్లుగా.. రికార్డులు పుట్టిస్తాడు. అదీ కూడా బలహీనుల స్థలాల్నే ఎంచుకుంటారు. తర్వాత ఆ స్థలం తమదని బోర్డు పెట్టి.. చుట్టూ కందకాలు తవ్వించేస్తారు. ఎవరూ మాట్లాడకుండా.. తను ఎంత భయంకరమైన వ్యక్తినో నలుగురితో చెప్పిస్తాడు. ఇది ఫ్యాక్షనిస్టులు చేసే కబ్జా తీరు. సినిమాల్లో ఇలాంటివి చాలా చూశాం. ఇప్పుడు.. రియల్‌గా చూపించారు.. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. యాదాద్రి వద్ద ఉన్న రూ. వంద కోట్ల విలువైన ఓ స్థలం చుట్టూ.. కందకం తవ్వించేసి..ఆ స్థలం తనదని బోర్డు పెట్టించారు. తాను ఎప్పుడో.. 1980ల్లో కొన్నానని ప్రకటించారు.
యాదాద్రిలో శివప్రియనగర్ -2 పేరుతో ఓ వెంచర్ ఉంది. దాదాపుగా ఇరవై ఏళ్ల కిందట కర్నూలుకు చెందిన ఓ రియల్టర్ దాన్ని ప్లాట్లుగా వేసి.. ఇతరులకు విక్రయించాడు. ఇప్పుడు యాదాద్రిలో స్థలాల రేట్లు ఊహించని విధంగా పెరిగాయి. ఆ వెంచర్ ఖరీదు ..రూ. వంద కోట్లకు చేరింది. ఇంత కాలం ఆ భూమిపై ఎలాంటి వివాదాలు లేవు. కానీ.. హఠాత్తుగా.. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రంగంలోకి దిగారు. స్థలం చుట్టూ కందకం తవ్వించి అందులోకి ఎవరూ వెళ్లకుండా… కాపలా పెట్టారు. ఆ స్థలం తనదని బోర్డులు పెట్టారు. గతంలో హైదరాబాద్ చుట్టుపక్కన జరిగిన కబ్జాల తరహాలో ఇది ఉండటంతో.. యాదాద్రిలో కలకలం రేపుతోంది.
వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది.. టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి.. ఒకటి రెండు సార్లు… బహిరంగంగానే కేసీఆర్, కేటీఆర్ ను పొగిడారు. ఓ సారి.. ఏపీకి కూడా ముఖ్యమంత్రి కేసీఆరే అన్నట్లుగా మాట్లాడి.. రాంభూపాల్ రెడ్డి కలకలం రేపారు. టీఆర్ఎస్ పెద్దల్ని పొగిడి.. వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా తమ భూ వ్యవహారాల్ని.. చక్కబెట్టుకుంటున్నారన్న ఆరోపణలు.. వస్తున్నాయి. తాను ఇరవై ఏళ్ల కిందటే కొన్నానని రాంభూపాల్ రెడ్డి చెబుతున్నారు. అప్పుడే కొంటె.. శివప్రియనగర్ పేరుతో ప్లాట్లు వేసి అమ్మేసినా.. ఇంత కాలం ఎందుకు సైలెంట్ గా ఉన్నారో.. ఎవరికీ అర్థం కాని విషయం..!