యాత్ర 2 సినిమా టిక్కెట్లు కొని ప్రజలకు ఉచితంగా చూపించాలని వైసీపీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలను వైసీపీ నేతలు లైట్ తీసుకున్నారు. తమ దగ్గర దోచుకోవడానికి ఇదో మార్గమా అని ఎక్కువ మంది సైలెంట్ అయిపోయారు. టిక్కెట్ ప్రకటించిన ఇంచార్జులు కూడా ఎక్కువ మంది రిస్క్ తీసుకోలేదు. బాగా సంపాదించేసుకున్న కొంత మంది మాత్రం… కొంత హడావుడి చేశారు. తొలి రోజు అసలు ఆడియెన్స్ రాలేదు. అంతా వైసీపీ నేతలే టిక్కెట్లు కొని పంపిణీ చేశారు. అయినా ఆక్యుపెన్సీ యాభై శాతం వరకూ రాలేదు.
తెలంగాణలో అయితే అసలు పట్టించుకున్న వారు లేరు. ధియేటర్లకు ఎదురు రెంట్స్ కట్టుకోవాల్సి వస్తోంది. కనీసం అక్కడ ఉచితంగా టిక్కెట్లు పంచే నాయకులు కూడా లేరు. మల్టిప్లెక్స్లకు అద్దెలు కట్టుకోవాలి కాబట్టి కార్పొరేట్ బుకింగ్ తరహాలో ఇరవై శాతం వరకూ బుక్కింగ్స్ చూపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. యాత్ర 1 సందర్భంగా పెద్ద ఎత్తున వైసీపీ నేతలు డబ్బులు ఖర్చు పెట్టి.. ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వస్తుందని ఏదో ఓ పదవి వస్తుందని ఆశ పడ్డారు. అలాంటి వారిలో అధికారంలోకి వచ్చినా ఉత్సాహం పది శాతం కూడా లేదు.
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా కొనకపోవడంతో … యాత్ర 2కు భారీ నష్టాలు రావడం ఖాయమయింది. అయితే అది ఎన్నికల పెట్టుబడి అని.. ఖర్చు పెద్ద విషయం కాదని.. ఉచితంగానే ప్రదర్శిస్తారని వైసీపీ వర్గాలంటున్నాయి. త్వరలో వ్యూహం, శపథం కూడా రిలీజ్ చేస్తారని.. వాటిని కూడా ఉచితంగా చూపించాలని … ఒత్తిడి చేస్తే పార్టీ నేతలు మరింత గుస్సా అయ్యే అవకాశం ఉంది.