జగన్ రెడ్డి పిచ్చి రాజకీయాలపై వైసీపీ ఎమ్మెల్యేలకు విరక్తి వస్తోంది. ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి వెళ్లకపోవడంపై వారు మథనపడుతున్నారు. అసెంబ్లీకి ఏ కారణంతో వెళ్లకుండా ఉండాలో వారికి అర్థం కావడం లేదు. ప్రజలకు ఏ సమాధానం చెప్పాలో కూడా వారికి అయోమయంగా ఉండటంతో అసెంబ్లీకి వెళ్లేందుకు అనుమతించాలని సజ్జలను కోరుతున్నారు. కనీసం తమ ప్రశ్నలు ఉన్నప్పుడు అయినా వెళ్లి వస్తామని వారు అడుగుతున్నారు. ముందుగా దానికి అంగీకరించిన జగన్ తర్వాత మాత్రం అసలు వద్దనేశారు.
దీంతో ఎమ్మెల్యేలలో అసహనం పెరిగిపోతోంది. జగన్ కాకుండా ఉన్న పది మంది ఎమ్మెల్యేలలో నలుగురు కొత్తవారు.సభలో నిలబడి అధ్యక్షా అని పిలవాలన్న ఎంతో ఆశతో ఉన్నవారు. మిగిలిన వారు కూడా అసెంబ్లీకి వెళ్లని ఎయమ్మెల్యే పదవి ఏంటి అన్న సందేహంలో ఉన్నారు. అందుకే వారు మరో ఒకటి, రెండు సార్లు విజ్ఞప్తి చేసి కాదంటే.. ఇక తమ సొంత నిర్ణయం మేరకు అసెంబ్లీకి వెళ్లాలని అనుకుంటున్నట్లుగా వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది. ఇవాళ కాకపోతే వచ్చే ఏడాది అయినా అసెంబ్లీకి వెళ్లకపోతే అనర్హతా వేటు వేస్తారు. ఆ భయం కూడా ఎమ్మెల్యేలకు ఉంది.
జగన్ రెడ్డికి ఉన్నదే పది మంది ఎమ్మెల్యేలు. వారి మాట కూడా ఆలకించకుండా.. వారి అభిప్రాయాలు వినకుండా.. తన నిర్ణయాలు తాను తీసుకుంటే వారి నిర్ణయాలు వారు తీసుకునే అవకాశం ఉంది.ఇప్పటికే పెద్దిరెడ్డి పార్టీ కోసం పని చేసేందుకు సిద్ధంగా లేరు. ఆయనకు ఉమ్మడిచిత్తూరు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినా తీసుకోడానికి నిరాకరించారు. ఇప్పుడు వైసీపీ సమావేశాలకు వస్తున్నారు కానీ నోరు మెదపడం లేదు. అందుకే జగన్ ఎమ్మెల్యేల అభిప్రాయాలు విని.. వారి ఆలోచనల మేరకు నడుచుకుంటే వారినైనా కాపాడుకుంటారు..లేకపోతే మొదటికే మోసం వస్తుంది.