వైసీపీ నేతలను ఏమైనా అంటే..అది కక్ష సాధింపులన్న ప్రచారం చేస్తారన్న ఉద్దేశంతో అవసరానికి మించి మెదకదనం చూపిస్తున్నారు పోలీసులు. అటు సోషల్ మీడియా అయినా కావొచ్చు.. ఇటు హత్యలు, దొమ్మీలు వంటి కేసుల్లో అయినా కావొచ్చు.. వైసీపీ ముద్ర ఉన్న వారిపై చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారు. ఫలితంగా ఇప్పుడు ధైర్యంగా తమ పాత పద్దతిలోకి వస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.
టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తల్లో చాలా మంది పార్టీ ఓడిపోగానే… అకౌంట్లు యాక్టివేట్ చేసుకుని ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ ఇతర పేర్లతో అకౌంట్లలో పచ్చి బూతులు కొనసాగిస్తున్నారు తాము చేసిన ఘోరమైన పనులపై తమను చితక్కొట్టేస్తారని వారికి తెలుసు. పెద్దగా ఏమీ అనకపోయినా టీడీపీ కార్యకర్తల్ని వైసీపీ పోలీసులు ఎలా కొట్టారో అందరికీ తెలుసు. అందుకే వారు కూడా భయపడిపారిపోయారు. కానీ రెండు నెలలు తిరగక ముందే అందరూ వేరే రూపంలో వచ్చి సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి ఫోటోలను కూడా మార్ఫ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంను వదలట్లేదు. అత్యంత ఘోరంగా పోస్టులు పెడుతున్నారు.
సోషల్ మీడియా పోస్టుల విషయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. విభాగం ఏర్పాటు చేసినా చేయకపోయినా… ఒకరిద్దరికి సరైన కోటింగ్ ఇస్తే… మిగిలిన వాళ్లు భయపడారు. కానీ ఆ ఒకరిద్దరికి కూడా కోటింగ్ ఇవ్వలేదు. నాగార్జున యాదవ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి..స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో ఇక ఎవరూ ఏమీ చేయలేరని ఎక్కువ మంది ఫీలయ్యారు. ఇక వైసీపీ నేతల విషయంలో జరుగుతున్నది కూడా అంతే. అత్యంత తీవ్రమైన నేరానికి పాల్పడిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై అన్ని ఆధారాలు ఉన్నా… స్టేషన్ బెయిల్ , సీఆర్పీసీ నోటీసు ఇచ్చి పంపించారు. ఈ పరిణామాలతో వైసీపీ నేతలు మరింత రెచ్చిపోతున్నారు. చెవిరెడ్డినే స్వయంగా అంతు చూస్తా అని బెదిరిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రజలు అధికారం సానుభూతితో ఇచ్చి ఉండరు. పరిస్థితుల్ని చక్కదిద్దాలనే ఇచ్చి ఉంటారు. కక్ష సాధింపులనే విమర్శలు వస్తాయని వైసీపీ నేతల్ని వదిలేయమని కాదు. లా అండ్ ఆర్డర్ ని అదుపులో పెట్టడం అంటే… వైసీపీ మూకల్ని వదిలేయడం కాదు. ఎవరి ట్రీట్ మెంట్ వాళ్లకు ఇచ్చేయాలన్నది టీడీపీ క్యాడర్ డిమాండ్. ఏమీ చేయకపోతే … మంచితనం కాదు.. చేతకాని వాళ్లమంటారని వారి ఆవేదన.