వైసీపీ అధికార భాషగా మారిపోయిన బూతులు, బెదిరింపులను ఎంపీ గోరంట్ల మాధవ్ పార్లమెంట్‌కు తీసుకెళ్లారు. గతంలో టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు తెలుగులోఆయన బూతులు అందుకునేవారు. ఇప్పుడు సొంత పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆ బాధ్యత తీసుకున్నారు. గతంలో పార్లమెంట్ ప్రాంగణంలో రఘురామకృష్ణరాజు అంతు చూస్తానని బెదిరించడమే కాదు.. ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టడం.. కేకలేయడంతో ఇతర రాష్ట్రాల ఎంపీలూ ఆశ్చర్యపోయారు. అప్పుడే రఘురామరాజు తర్వాత స్పీకర్‌కు ప్రధానికి ఫిర్యాదు చేశారు.
రెండు రోజుల కిందట సీబీఐ కేసుల అంశంపై మాట్లాడినప్పుడు కూడా దారుణంగా బూతులు తిట్టారని.. స్వయంగా పార్లమెంట్‌లోనే బూతులు మాట్లాడారని రఘురమకృష్ణరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మళ్లీ బుధవారం కూడా అదే సీన్ రిపీట్ అయిందని ఆయన స్పీకర్‌కు ప్రధానికి ఫిర్యాదు చేశారు. తన అంతు చూస్తానని.. చంపుతానని బెదిరిస్తున్నారని రఘరామ ఆరోపించారు. పార్లమెంట్‌లోని ఇతర ఎంపీలు ఎంపీ గోరంట్ల వ్యవహరిస్తున్న తీరును చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.
కనీస మర్యాద లేకుండా కేకలేయడం వంటివి చేస్తూండటంతో ఆయన వైపు అందరూ అదోలా చూస్తున్నారు. అయితే ఎంపీ గోరంట్ల మాత్రం అదే తనకు అప్పగించిన పని కాబట్టి అలాగే చేస్తానన్నట్లుగా చెలరేగిపోతున్నారు. ఆయనను స్పీకర్ కంట్రోల్ చేయకపోతే ఏపీ అసెంబ్లీ తరహా దారుణమైన పరిస్థితులు ఏర్పడుతాయని భావిస్తున్నారు.