వైసీపీకి నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు గుడ్ బై చెప్పారు. ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా సమర్పించారు. తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. లావు కృష్ణదేవరాయులను సీఎం జగన్ కొంత కాలంగా దూరంగా పెట్టారు. విడదల రజనీ ..ఎంపీ లావును టార్గెట్ చేసుకున్నారు. అయితే ఆమెకే ప్రాధాన్యం ఇచ్చారు. చివరికి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఎంపీ లావుకు కనీసం ప్రోటోకాల్ కూడా లభించలేదు. పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా.
టిక్కెట్ల కసరత్తు లావు కృష్ణదేవరాయులు పేరను పరిగణనలోకి తీసుకోలేదు. ఆయనను గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించారు. తాను చేయలేనని నేరుగా చెప్పేశారు కృష్ణదేవరాయులు. తర్వాత ఆయననే అభ్యర్థిగా ఖరారు చేయాలని నర్సరావుపేట ఎంపీ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులు సీఎం జగన్ పై ఒత్తిడి తెచ్చారు. ఇక ఆయనకే టిక్కెట్ ఖరారు చేస్తారేమో అనుకుంటున్న సమయంలో లావు.. రాజీనామా చేసేశారు.
కొద్ది రోజుల కిందట ఆయన హైదరాబాద్ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ ను కూడా కలిసినట్లుగా ప్రచారం జరిగింది. అయితే అధికారికంగా స్పష్టత లేదు. ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసినందున ఆయన టీడీపీల ోచేరడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. అమరావతి రైతుల పట్ల సానుభూతి ఉన్న కృష్ణదేవరాయులపై ప్రజల్లో సదభిప్రాయం ఉందని అంటున్నారు. నర్సరావుపేట ఎంపీ రాజీనామా వైసీపీకి పెద్ద షాక్ లాంటిదే. ఇప్పటికే కర్నూలు, మచిలీపట్నం ఎంపీలు గుడ్ బై చెప్పారు.