వైకాపా ఎంపీ మార్గాని భరత్ ప్రజల్ని విమర్శిస్తూ మూడు రోజుల కిందట చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ప్రజలకు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ని విమర్శించే హక్కు ఏ మాత్రం లేదు అంటూ ఆయన చేసిన ట్వీట్ రెండు రోజులు గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఎంపీ స్థాయి లో ఉన్న వ్యక్తి ఇలాంటి ట్వీట్ చేయడమేంటని సోషల్ మీడియా వేదిక గా జనాలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
వైకాపా ఎంపీ మార్గాని భరత్ ట్వీట్ చేస్తూ, ” నీ భార్య అకౌంట్లో అమ్మవడి డబ్బులు 15000 తీసుకుంటావు, కానీ జగన్ అన్నని తిడతావు. నీ కొడుకు అకౌంట్ లో 20000 విద్యాదీవెన తీసుకుంటావు కానీ జగన్ అన్నని తిడతావు. మీ అమ్మ కి వచ్చే 2250 పెన్షన్ తీసుకుంటావు కానీ జగన్ అన్నని తిడతావు. రైతుభరోసా కింద ప్రతి సంవత్సరం 12500 తీసుకుంటావు కానీ జగన్ అన్నని తిడతావు. ఆటో క్రింద ఇచ్చిన 10000 ఆర్థిక భరోసా డబ్బులు తీసుకుంటావ్. కానీ జగన్ అన్నను తిడతావ్..నీ భార్యకి ఇచ్చే వడ్డీ లేని డ్వాక్రాఋణం తీసుకుంటావు కానీ జగన్ అన్నను తిడతావు. నీ పొలానికి కరెంట్ 9 గంటలు ఫ్రీ గా తీసుకుంటావు కాని జగన్ అన్నను తిడతావు. నీ కూతురు ఆరోగ్యం బాగుండాలి అని స్కూల్ లో సాదా భోజనం కాకుండా జగనన్న పెడుతున్న పౌష్టికాహారం తీసుకుంటావు కానీ జగన్ అన్నను తిడతావు. నీకు ఏ ప్రభుత్వ పధకం కావాలన్న మీ ఇంటికే వచ్చి ఇచ్చే వాలింటీర్ లతో చేపించుకుంటావు కానీ అన్నను తిడతావు. నీవు ఎన్ని తిట్టినా, జగన్ అన్న నీలో కులం చూడడు,మతం చూడడు, ప్రాంతం చూడడు, పార్టీ కూడా చూడడు,అన్నీ నీకు ఇస్తాడు, ఎందుకంటే జగన్ అన్న ఒక దార్శనికుడు..” అని రాసుకొచ్చారు. ఇది తనకు వేేేరే వాళ్ళ నుండి వచ్చిన మెసేజ్ అని చెప్పుకొచ్చారు.
అయితే, జనాల లో ఎంపీ గారి ట్వీట్ పై అసహనం వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రజలు పన్నులు కట్టిన డబ్బు నుండి ప్రజలకు తిరిగి ఇస్తున్నాడని, తాము ఎన్నుకున్న నాయకుడు తప్పులు చేసినప్పుడు ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుందని, ముఖ్యమంత్రిని అసలు ఎవరు విమర్శించ కూడదు అంటూ ఎంపీ మార్గాని భరత్ చెప్పడం సరికాదని జనాలు అంటున్నారు. ఇంకొందరైతే ఒక అడుగు ముందుకు వేసి, జగన్ తన సొంత డబ్బు నుండి ప్రజలకు ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టిన రోజున తప్పకుండా ఆయన ఏం చేసినా విమర్శించకుండా ఉంటామని, తన లోటస్ పాండ్, లేదా భారతి సిమెంట్ వంటి ఆస్తులు అమ్మి ప్రజలకు ఏదైనా చేసిన రోజున తప్పకుండా ఆయన కి జై కొడతామని అంటూ, తాము కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటూ మమ్మల్నే ప్రశ్నించే వద్దనడం ఎంతవరకు సమంజసం అని అంటున్నారు. ..
ఏది ఏమైనా ఎంపీ గారి ట్వీట్ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ప్రజల విమర్శలు పొందుతోంది.