అమలాపురానికి చెందిన మంత్రి పినిపె విశ్వరూప్ కు టిక్కెట్ ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు వైసీపీ అధినేత జగన్ విచిత్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనపై ఇటీవలి కాలంలో ఎలాంటి అభిమానం చూపించడం లేదు. ఆయన ఇంటిపై దాడి చేస్తే కనీస పరామర్శ లేదు. తర్వాత అనారోగ్యానికి గురై నెలల తరబడి చికిత్స పొందినా పెద్దగా పరామర్శల్లేవు. ఇప్పుడు ఆయన తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ కుటుంబంలోనే గొడవలు ఉండటంతో తానే పోటీ చేస్తానంటున్నారు.
తాజాగా విశ్వరూప్ .. పవన్ సీఎం కావాలని తానూ కోరుకుంటున్నానని ప్రకటించారు. ప్రో వైసీపీ మీడియాలో దీనికి విపరీతమైన కవరేజీ వచ్చింది. అంతే కాదు విశ్వరూప్ జనసేనలోకి జంప్ అవడానికి చర్చలు జరిపారని కూడా ప్రకటించారు. ఆయన కుమారుడు పవన్ తో భేటీ అయ్యారని… ఇక చేరడమే లాంచనం అనుకుంటున్నారని కథనాలు వండి వారుస్తున్నారు. నిజానికి విశ్వరూప్ చెప్పింది అది కాదు… పవన్ సీఎం కావాలని అనుకుంటున్నాను.. కానీ ఆయన అన్ని చోట్ల పోటీ చేస్తేనే కదా సీఎం అయ్యేది అది వైసీపీ లైన్ లోనే అన్నారు. కానీ దాన్ని భిన్నంగా ప్రజెంట్ చేస్తోంది వైసీపీ మీడియా.
విశ్వరూప్ ను వదిలించుకోవాలని నిర్ణయించుకోవడంతోనే వైసీపీ వ్యూహకర్తలు ఆయనపై ఇలా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఎవరికైనా అర్థం అయిపోతుంది. ఈ విషయం అర్థం చేసుకోలేనంత అమాయకుడు మంత్రి విశ్వరూప్ అయి ఉండరు. మరి ఆయనేం చేస్తారో ?