గ్రేటర్ హైదరాబాద్‌లో జరుగుతున్న స్థానిక ఎన్నికలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. దుబ్బాాక వంటి ఇంటీరియర్ తెలంగాణతో పోలిస్తే, సీమాంధ్రులు ఎక్కువ సంఖ్య్యలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజల తీర్పు కాస్త విభిన్నంగా ఉండేే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి టిఆర్ఎస్ , బిజెపి కాంగ్రెస్ జనసేన పార్టీలుుు సన్నాహాలు చేస్తూంటే, ఇతర పార్టీ లు మీనమేషాలు లెక్కపెడుతున్నాయి. అయితే జీహెచ్ఎంసీ ఎన్నిక లో పాల్గొనే విషయంపైై వైఎస్ఆర్సిపి అధికారికంగా ప్రకటన చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధకారికంగా ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా పార్టీని భవిష్యత్తులో బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో 151 సీట్లు సాధించి బలమైన పార్టీ గా ఉన్న వైకాపా, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పౌరులు ఎక్కువ గా ఉన్న హైదరాబాద్ లో పోటీ చేయడానికి వెనుకాడడం చర్చ కి దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ గా ఉండి, 151 సీట్లతో అత్యంత బలంగా కనిపిస్తున్న ఇటువంటి అనుకూల సమయంలోనే హైదరాబాదులో పోటీచేయడానికి వైఎస్ఆర్సిపి వెనుకాడుతోంది అంటే, భవిష్యత్తులో కూడా తెలంగాణలో పార్టీ పోటీ చేయకపోవచ్చని, ఒకరకంగా హైదరాబాద్ లో వైకాపా బిచాణా ఎత్తివేసేనట్లేనని రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.