వైసీపీ హ యాంలో ఏపీని ఓ ప్రైవేటు సామ్రాజ్యంగా చేసుకుని దోచుకున్న వైనం ఇప్పటి వరకూ బయటకు వచ్చింది తక్కువే. అసలు బయటకు రావాల్సింది ఎంతో ఉంది. అధికారంలోకి వచ్చింది మొదలు… తమ వస్తువులే ఏపీలో ప్రజలు, దేవుళ్లు వాడుకోవాలన్నట్లుగా రాజకీయం చేశారు. దానికి సాక్ష్యం మద్యమే కాదు… తిరుమలకు సరఫరా చేసిన వస్తువులు కూడా.
వైసీపీ అధికారంలోకి రాగానే మద్యం పాత బ్రాండ్లను శివారుల్లోనే ఆపేసి.. పాత డిస్టిలరీలు కొనుగోలు చేసి సొంత బ్రాండ్లు ఉత్పత్తి చేసి ప్రజలకు అమ్మారు. అది కోణం మాత్రమే. ఏపీలో ప్రతి వస్తువును ఇలాగే చేశారన్నది ఆలస్యంగా బయటపడుతున్న నిజం. టీటీడీ వస్తువులటెండర్ల ఖరారు ప్రక్రియను చూసేవారికి ఇదే అర్థమవుతుంది. నెయ్యిని టెండర్‌కు తీసుకునేది ఒకరు సప్లయ్ చేసిది మరొకరు. దీనికి అంగీకరిస్తేనే ఆ టెండర్ ఆ కంపెనీకి దక్కుతుంది. అందుకు ఎంతో కొంత పడేస్తారు.
మద్యం, నెయ్యి మాత్రమే కాదు నిర్మాణ రంగంలో సిమెంట్ కూడా. భారతి సిమెంట్ ను ప్రతి దానికి వాడేశారు. ఏదో కాస్త కప్పం చెల్లించిన వారికి మిగతా చోట్ల అవకాశం కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే… తవ్వుకుంటూ రావాల్సినవి చాలా ఉంటాయి. ఇన్ని చేశారా.. లఅంటే… ఇంత ఘోరంగా ప్రజల్ని దోచుకున్నారా అని ప్రతి సారి ఆశ్చర్యపడలేక.. కామనేగా అనునుకునే పరిస్థితిని కల్పించారు.