నమ్మించి మోసం చేశారని అమరావతి రైతులు పాదయాత్ర చేస్తూంటే వారికి పోటీగా నిరసన యాత్రలు చేయడానికి వైసీపీ ప్రణాళికలు వేస్తోంది. మేధావులతో సమావేశాలు వర్కవుట్ కాకపోవడంతో ఏదో ఒకటి చేయాలన్న తలంపుతో వారి దిగజారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర మొత్తం అలాంటి స్పందన వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే వైసీపీ పరువు పోతుందని మూడు రాజధానులకుమద్దతు లేదన్న విషయం బలంగా ప్రజల్లోకి వెళ్తుందని భయపడుతోంది. అందుకే ఎలాగోలారైతుల పాదయాత్రను ఆపడానికి విధ్వంసకర వ్యూహాలు పన్నుతున్నట్లుగా తెలు్సతోంది.
ఇప్పటి దాకా లేని.. వికేంద్రీకరణ జేఏసీని తెరపైకి తెచ్చారు. నిజానికి అమరావతికి వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. వైసీపీనే ..ఇతర ఉనికిలేని సంఘాలను స్పాన్సర్డ్ చేసి జేఏసీ పేరుతో తెరపైకి తెచ్చి.. విధ్వంసానికి సిద్ధమవుతోందన్న అనుమానాలు తాజాగా మంత్రి అమర్నాథ్ చేసిన ప్రకటనతో స్పష్టమవుతోంది. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఈ మొత్తం ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఆయన నేతృత్వంలో వైసీపీ నేతలంతాసమావేశమయ్యారు. పాదయాత్రకు ఆటంకాలు కల్పించేలా ఏదో ఒకటి చేయకపోతే ఇబ్బందులు వస్తాయని నిర్ణయించారు.
అందుకే పాదయాత్రపై నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. జేఏసీని ఏర్పాటు చేశామని.. ఒకటి, రెండు రోజుల్లో కార్యాచరణను రూపొందిస్తుందని, దాని ప్రకారం తామంతా నడుచుకుంటామని చెప్పారు. వికేంద్రీకరణకు మద్దతుగా పాదయాత్రలు, వార్డు స్థాయి సమావేశాలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని చెబుతున్నారు కానీ.. అంతకు మించిన ప్రణాలికలు అమలు చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎలాంటి పరిణామాలు జరిగినా పూర్తిగావైసీపీ స్సాన్సర్డ్ వే కాబట్టి … నష్టం కూడా ఆ పార్టీకే ఉంటుందని అంచనా వేస్తున్నారు.