ఏపీలో జగన్ రెడ్డికి అంతా అనుకూలంగా ఉందని సర్వేలు వచ్చేలా.. మూడేళ్ల నుంచి చాలా పెద్ద బడ్జెట్ తో ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు.. కోడ్ వచ్చాక పరువు తీస్తున్నాయి. తాడేపల్లిలో పెట్టుకున్న కంపెనీతో పాటు మరికొన్ని ఊరూపేరు లేని కంపెనీలతో కొనుక్కున్న సర్వేలతో నిన్నటి వరకూ హడావుడి చేశారు. తాజాగా అవి కూడా ప్లేటు తిప్పేస్తున్నాయి.
ఈ నెల మొదట్లో ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే ప్రసారం చేసింది. అందులో వైసీపీకి పదిహేను సీట్లు వస్తాయని పేర్కొన్నారు. వెంటనే నీలి,కూలి మీడియా అందుకుని జగన్ కు ఎదురు లేదని చెప్పుకోవడం ప్రారంభించారు. ఎన్నికలకోడ్ రాగానే… ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ప్లేట్ ఫిరాయించింది. మరో సర్వే ప్రసారం చేసింది. అందులో ఒక్క టీడీపీకే 14 సీట్లు.. బీజేపీకి రెండు, జనసేనకు ఒక్కటి.. వస్తాయని వైసీపీకి ఎనిమిదే వస్తాయని తేల్చింది ఈ సర్వేను వైసీపీ వాళ్లు కూడా జావగారిపోవాల్సి వస్తోంది.
ఇక ఈటీజీ పేరుతో జగన్ కు.. వైసీపీకి పాతిక పాతిక సీట్లు వేసే కంపెనీ..తాడేపల్లిలో పుట్టింది. ఈ కంపెనీ.. కూడా ఇటీవల సర్వే నెంబర్లు మారుస్తోంది. మొదట్లో పాతిక సీట్లు వేసే కంపెనీ.. తర్వాత 17 వేస్తూ వస్తోంది. రేపు మళ్లీ వేయాల్సి వస్తే ఎన్ని వేస్తుందో .. సీఎంవోలో ఎగ్జిక్యూటివ్ అయిన అవినాష్ ఇరగవరపుకే తెలియాలి. ఎందుకంటే ఆయనదే మరి కంపెనీ.