అధికారం అంతమవుతోందన్న ఆందోళనతో ప్రజల్లో చిచ్చు పెట్టడానికి వైసీపీ మహా ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. గిరిజనుల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తూండటంతో కొత్తగా గిరిజిన ప్రాంతాల్లో సెటిలర్లు అనే పదాన్ని తీసుకు వచ్చి చిచ్చు పెట్టేసింది. ఓ డిప్యూటీ సీఎం ఇలా మాట్లాడటం.. దానికి నీలి, కూలి మీడియా ప్రాధాన్యం ఇవ్వడంతోనే అజెండా ఎమిటో స్పష్టయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఉమ్మడి విజయనగరం జిల్లాసాలూరు నియోజవర్గం ఎస్టీ రిజర్వుడు. అక్కడ ఎమ్మెల్యే రాజన్నదొర ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సీఎం తర్వతా సీఎం అంతటి పవర్ ఫుల్ పొజిషన్ లో ఉన్న ఆయన సాలూరులో రెడ్లు, చౌదరిలు ఎక్కువైపోయారని.. వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. నేరుగా కులం పేర్లు ప్రస్తావించడమే కాదు.. సెటిలర్లు అనే పదం కూడా వాడారు.
దీంతో గగ్గోలు ప్రారంభమయింది. వైసీపీ వ్యూహం ప్రకారం గిరిజన ప్రాంతాల్లో కోల్పోయిన పట్టు ను సాధించడానికి ఇలా ప్రజల మధ్య చిచ్చు పెడుతోందన్న అభిప్రాయం పెరుగుతోంది. సాలూరులో రెడ్లు, కమ్మ సామాజికవర్గాలు యాభై, అరవై ఏళ్ల క్రిమే.. వ్యవసాయం కోసం వచ్చాయి. అక్కడ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో వారు లేరు. అరకు అయితే ట్రైబల్ కేటగిరిలోఉంటుంది.అక్కడ ఇతరులు భూములు కొనుగోలు చేయడానికి ఉండదు. సాలూరులో అలాంటిది లేకపోవడంతో బయట వాళ్లు భూములు కొని వ్యవసాయం చేస్తున్నారు.
ఇప్పుడు వారిని బూచిగా చూపించి గిరిజనులను.. తమ పార్టీ వైపు ఉంచుకునేందుకు వైసీపీ కుట్ర చేస్తోందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ముందు ముందు ఇలా అక్కడి సెటిలర్లపై దాడులకు పాల్పడటం ద్వారా మంట రాజేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెబుతున్నారు. రాజకీయాల్లో ఏమైనా చేయవచ్చునని వైసీపీ ఇప్పటికే నిరూపించిందని గుర్తు చేస్తున్నారు.