జనసేనను నిర్వీర్యం చేసేందుకు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్‌గానే ఆపరేషన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు మోరల్ సపోర్ట్‌గా ఉన్న వారిని ముందుగా టార్గెట్ చేసి.. ఒక్కొక్కరిని బయటకు పంపేయడమో.. లేదా.. తాము లాగేయడమో చేస్తున్నారు. ఈ విషయంలో.. రాజురవితేజ విషయంలో క్లారిటీ వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజురవితేజ.. ఎవరో ఎవరికీ తెలియదు. ఆయన పవన్ కల్యాణ్ మిత్రుడు. రాజురవితేజ భావజాలం..తన ఆలోచన విధానం ఒక్కటి కావడంతో.. జనసేన పార్టీ స్థాపనలో.. ఆయనకూ క్రెడిట్ ఇచ్చారు పవన్ కల్యాణ్. అలా ఆయన బయటకు తెలిశారు.
విజయసాయిని కలిసిన తర్వాతే రాజురవితేజ రాజకీయం..!
మొదటి నుంచి రాజురవితేజ పార్టీ అంతర్గత వ్యవహారాల్లోనే ఉన్నారు. ఎప్పుడూ తెర ముందుకు రాలేదు. కానీ హఠాత్తుగా ఆయన తెర ముందుకు వచ్చారు. పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి లాంటి వాళ్లు విరుచుకుపడితేనే… గంటలకొద్దీ డిబేట్లు పెట్టే మీడియాలు ఉంది..ఇక.. నిన్నటి వరకూ.. పవన్ కల్యాణ్ ఆంతరంగీకుడిగా ఉన్న రాజురవితేజ బయటకు వచ్చి ఆయనను తిడితే ఎందుకు ఊరుంటారు..? అలాగే రచ్చ చేశారు. కానీ.. రాజురవితేజ.. చాలా చోట్ల బయటపడిపోయారు. ఆయన.. సొంతంగా.. పవన్ కల్యాణ్‌కు దూరం జరగడం లేదని.. తాను అలా వెళ్లడానికి.. పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడటానికి చాలా బలపమైన కారణాలే ఉన్నాయన్న హింట్‌ను ఆయనే ఇస్తున్నారు.
పవన్‌తో విబేధిస్తే అంత తీవ్ర విమర్శలు చేయాల్సిన అవసరం ఏముంది..?
కొద్ది రోజుల కిందట.. తాను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిశానని.. ఆయన సాక్షి మీడియాకు చెప్పారు. అంతే కాదు.. ఆయన విధానాలు నచ్చాయని కూడా చెప్పుకున్నారు. నిజానికి రాజురవితేజ.. కరీంనగర్‌కు చెందిన వ్యక్తి. ఆయనకు ఏపీతో ఎలాంటి సంబంధాలు లేవు. అలాంటి.. విజయసాయిరెడ్డిని కలవాల్సిన అవసరం ఏముంది..? తెలంగాణలో వైసీపీ లేదు. రాజు రవితేజ మాటల్ని బట్టి చూస్తే.. వైసీపీ.. జనసేనను టార్గెట్ చేసి.. పక్కా ప్రణాళిక ప్రకారం.. ఆ పార్టీకి పిల్లర్లుగా.. ఉన్న వారిని టార్గెట్ చేసింది. పవన్ పార్టీ పెట్టడానికి ఓ కారణంగా చెప్పుకున్న రాజురవితేజనే.. ఆయన రాజకీయాలకు పనికిరాడని ప్రకటిస్తే.. అది పవన్ కు పెద్ద డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతో వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా రాజు రవితేజను బయటుక తెచ్చినట్లుగా భావిస్తున్నారు.
జనసేన ఉనికిపై దెబ్బకొట్టే వ్యూహంలో వైసీపీ..!?
నిజానికి పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ.. ఆయన కూడా అసంతృప్తి చెందుతూనే ఉన్నారు. గతంలో ఓ సారి బయటకు వెళ్లిపోయారు. అందరూ లైట్ తీసుకున్నారు. మళ్లీ తనే వచ్చారు. పవన్ ఆహ్వానించారు. కానీ… ఇప్పుడు మాత్రం పక్క పార్టీతో కలిసి.. పవన్ పైనే రాజురవితేజ కుట్ర చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి పవన్‌కు ఇదే మొదటి షాక్ కాదు.. చివరి షాక్ కాదు. ముందు ముందు చాలా షాకులుండే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే.. జనసేనను.. వైసీపీ అంత తీవ్రంగా టార్గెట్ చేసింది మరి..!