తిరుపతి గోశాలపై వివాదంతో రాజకీయం చేయాలనుకున్న వైసీపీ నవ్వులపాలైంది. గోశాలలో ఆవులు చనిపోయినట్లు నిరూపించాలని టీడీపీ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు చెప్పిన భూమన..తను రోడ్డుపై పడుకొని ఎంచక్కా ఎంపీ గురుమూర్తిని పంపించారు. ఆయన కారులో గోశాలకు వచ్చి, హాయిగా నడుచుకుంటూ వచ్చి కూటమి ఎమ్మెల్యేలతో మాట్లాడారు. భూమన ఎక్కడ అని అడిగితే..పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. భూమనను అడ్డుకోవడానికి కారణం.. ఆయన గోశాలకు బలప్రదర్శన చేయడానికి వెళ్తున్నట్లు వందలాది మందితో బయల్దేరడమే.
గోశాలకు వందలాది మందితో వెళ్తానంటే ఎవరైనా అనుమతిస్తారా? గోవులు అంతమందిని చూసి బెదిరి, రంకెలు వేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? కామన్ సెన్స్ ఉన్నవాళ్లు ఎవరైనా ర్యాలీగా గోశాలకు వందలాది మందితో వెళ్తామంటే అనుమతించరు. పోలీసులు అదే చెప్పారు. చేశారు. అయినా భూమన వినలేదు. సవాల్ ను స్వీకరించి గోశాలకు వెళ్లకపోతే పరువు పోతుందని , పెద్దగా రాజకీయం అనుభవం లేని గురుమూర్తిని పంపించారు.ఆయన వచ్చి భూమనను అడ్డుకున్నారని కాకమ్మ కథలు వినిపించారు. తనను కూడా పోలీసులు అడ్డుకుంటే గోడదూకి వచ్చానన్నారు. ఆయన స్వేచ్ఛగా గోశాలలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇది స్పష్టంగా వీడియో రికార్డ్ అయింది. కానీ, స్క్రిప్ట్ ప్రకారం లోపలికి ఎంట్రీ ఇచ్చి, మీడియా ఎదుటే అబద్దాలు చెప్పేశారు.
అంతకుముందే కూటమి ఎమ్మెల్యేలు భూమనకు కాల్ చేసి ఐదుగురు గోశాలకు రావచ్చునని కోరినా.. ఆయన మాత్రం నిరాకరించారు. నిజంగా సవాల్ ను స్వీకరిస్తే తను ఒక్కరే గోశాలకు వచ్చి జరిగినదేంటో చూపించేవారు. కానీ, భూమన మాత్రం రాజకీయం మాత్రమే చేయాలనుకున్నట్టు ఉన్నారు. అందుకే తన ఇంటి దగ్గరే ఎక్స్పర్ మెంట్స్ కు దిగారు. గోశాలకు వెళ్తుంటే తనను పోలీసులు అడ్డుకుంటున్నారని ప్రచారం చేసుకున్నారు. భూమన రాజకీయం చూసిన వారందరికీ.. అంతమందితో గోశాలకు వెళ్తానంటే ఎలా అనుమతిస్తారు అని సందేహం కల్గింది. ఈ లాజిక్ ను మరిచి ఇంటిదగ్గర హల్చల్ చేస్తూ.. పోలీసులు అడ్డుకుంటున్నట్లుగా ప్రచారం చేసుకున్నారు.
సవాల్ ను స్వీకరించచినట్లు చెప్పి..భూమన గోశాలకు వెళ్లకుండా గురుమూర్తిని పంపడం… రోడ్డుపై నానాయాగీ చేయడం చూసి జనాలు ముక్కున వేలేసుకున్నారు. మొత్తంగా టీటీడీ పేరిట వైసీపీ చేయాలనుకున్న పొలిటికల్ షో చేసింది కానీ, సవాల్ పాలిటిక్స్ లో నవ్వులపాలైందని అంటున్నారు.