వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.. చేతికి అంది వచ్చిన అవకాశాల్ని.. నేలపాలు చేసుకుని.. సెల్ఫ్ గోల్స్ స్పెషలిస్ట్‌గా మారుతూ ఉంటారని… విపరీతంగా సెటైర్లు వస్తూ ఉంటాయి. దానికి కారణం ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ.. ఎదురు తన్నడమే. చాలా సింపుల్ లాజిక్ ఉండే.. రాజకీయ అంశాల్లోనూ ఆయన బోర్లా పడుతూ ఉంటారు. ఇప్పుడు… కోడి కత్తితో దాడ జరిగిన విషయంలోనూ… జగన్మోహన్ రెడ్డి.. అదే చేసుకున్నారా..? రావాల్సిన సింపతీని.. చేజేతులా పాడు చేసుకున్నారా…?
బాధితుడు ఎందుకు విమర్శల పాలవుతున్నాడు..?
నిజానికి అది కోడి కత్తా..? వేట కత్తా..? అన్నది మ్యాటర్ కాదు.. ! దాడి జరిగిందా లేదా.. అన్నదే అసలు విషయం. ఇక్కడ దాడి జరిగింది. విమానాశ్రయంలో.. అత్యంత భద్రత ఉండే చోట… రోజూ వీఐపీలు రాకపోకలు సాగించే చోట జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. ఆ విషయంలో ఆయనపై.. అందరూ సానుభూతి చూపిస్తారు. ఆయన భద్రతపై.. ఆందోళన వ్యక్తం చేస్తారు. కచ్చితంగా ఆందోళన వ్యక్తం చేయాల్సిన అంశమే. ఈ విషయంలో తప్పు ఎవరిదన్నాది తేల్చాలి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. ఇందులో కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బాధితుడే. మరి జగన్‌కు రావాల్సినంత సింపతీ వచ్చిందా..? ఎందుకు విమర్శలు పాలవుతున్నారు..?
జగన్ రాజకీయం చేయడమే తప్పయిందా..?
వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. దాని కోసం ఆయన విమానాశ్రయంలో ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. ఆ తీవ్రత… ఎంత అనేది మొదట బయటకు రాలేదు. అదేం పెద్ద గాయం కాదని.. ఆయన బాడీ లాంగ్వేజ్ బట్టి తెలిసిపోతుంది. ప్రాథమిక చికిత్స చేయించుకుని… విమాశ్రయంలోని డ్యూటీ డాక్టర్ బియ్యపు గింజంత గాయం.. లోపలికేమీ దిగబడలేదు..అని తేల్చిన తర్వాత… అదీ కూడా.. మూడు గంటల తర్వాత.. హైదరాబాద్ ఆస్పత్రిలో చేరడం ఎందుకు..? తొమ్మిది కుట్లు పడినట్లు ప్రచారం చేసుకోవడం ఎందుకు..? కనీసం చొక్కా కూడా చిరగని కత్తిగాటుకు.. ఎనిమిది కుట్లు పడతాయని.. సామాన్యులు ఎవరైనా నమ్ముతారా..?. ఇంట్లో ఆడవాళ్లు ఉల్లిపాయలు కోసేటప్పుడో.. ముల్లు గుచ్చుకున్నప్పుడో.. అంత కన్నా పెద్ద గాయం అవుతుందే.. జగన్ ఎందుకు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందనే చర్చ రావడానికి ఆయనే కారణమయ్యారు. ఫలితంగా.. దాడి విషయం పక్కకు పోయింది. చిన్న గాయాన్ని పట్టుకుని రాజకీయం చేస్తున్నారన్న అంశం తెరపైకి వచ్చింది.
సీఎం, డీజీపీ ప్లాన్ చేసి కోడి కత్తితో కుర్రాడ్ని పంపుతారా..?
ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు లేని గాయాన్ని హైలెట్ చేసుకోవడంతో పాటు… అదే పనిగా.. చంద్రబాబు, డీజీపీనే కుట్ర చేశారని చెప్పుకోవడం కూడా.. జగన్ పై.. ఏ మాత్రం సానుభూతి కలగకపోవడానికి కారణం కాగా… అసలు… ఇలాంటి సీన్ క్రియేట్ చేయడానికి జగనే చేయించుకున్నారేమో అన్న అనుమానాలు పెరగడానికి కారణం అయింది. ఎందుకంటే… ప్రభుత్వాధినేత ప్లాన్ చేసి… డీజీపీ సహకరించి.. టార్గెట్ పెట్టుకుంటే… ఎలా ఉంటుందో… అందరికీ తెలుసు. అంత పెద్ద స్థాయి వ్యక్తులు ఓ చిన్న కుర్రాడికి కోడి కత్తి ఇచ్చి పంపిస్తారా..?. అసలు ఆ ఆలోచనే.. ఆరోపణే.. చాలా కామెడీగా ఉంటుంది. కానీ వైసీపీ, జగన్, జగన్ మీడియా.. దీన్నే నమ్మించడానికి ప్రయత్నాలు చేసింది. ఫలితంగా సీరియస్ నెస్ పోయింది.
అసలు ఎవరైనా ఎన్నికలకు ముందు ఇలాంటి దాడులు ప్లాన్ చేస్తారా..?
ఎన్నికల ముంచుకొస్తున్న సమయంలో ప్రతిపక్ష నేతపై .. ఎవరైనా ఇలాంటి దాడులకు ప్లాన్ చేస్తారా..? ఏ మాత్రం రాజకీయ అవగాహన ఉన్న వారు కూడా.. చేయరని తెలుసు. ఎందుకంటే.. ఏం జరిగినా అది గవర్నమెంట్ మీదకే వస్తుంది. దాని వల్ల వాళ్లకు వచ్చే లాభం ఏమీ ఉండదు. పైగా పోయేదే ఎక్కువ. కేంద్రంతో పూర్తిగా సంబంధాలు వదిలేసుకుని ఘర్షణ వాతావరణం సృష్టించుకున్న టీడీపీ.. ఇలాంటి పని చేస్తుందా..? చాన్సే ఉండదు. ఇవన్నీ ప్రజలు ఆలోచించలేనంత పెద్దవి కావు. కానీ..జగన్ మాత్రం ఆలోచించలేకపోయారు. తనకు రావాల్సిన సానుభూతిని… మరో రకంగా మల్చుకుని సెల్ఫ్ గోల్‌గా మార్చేసుకున్నారు..
——— సుభాష్